ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ ఎప్పటికప్పుడు వినూత్న ఆఫర్స్ ప్రకటిస్తూనే ఉంది. పండుగలతో పాటు ప్రత్యేక ఆఫర్ సేల్స్ ద్వారా కస్టమర్ బేస్ పెంచుకుంటోంది. బిగ్ బిలియన్ డేస్, బిగ్ బచాత్ సేల్, బిగ్ సేవింగ్ డేస్.. అంటూ నిత్యం ఏదో ఒక ఆఫర్‌తో కస్టమర్ల ముందుకు వస్తోంది. తాజాగా అమెరికాలో ప్రారంభమై.. భారత్‌లో సెన్సేషన్‌గా మారిన ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ను తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
నవంబర్ చివరి శుక్రవారం జరుపుకునే ‘థాంక్స్ గివింగ్ డే’ను బ్లాక్ ఫ్రైడేగా పిలుస్తారు. క్రిస్మస్ పండగ షాపింగ్ కోసం యూస్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ చివరి శుక్రవారం రోజు షాపింగ్ కోసం ప్రత్యేకంగా ఈ సేల్‌ను తీసుకొచ్చారు. ఆ రోజున షాపింగ్ చేసే వారికి.. ఇ-కామర్స్ సంస్థలు, స్టోర్స్, షాప్స్ ప్రత్యేక తగ్గింపులు, భారీ ఆఫర్‌లను ఇస్తాయి. ఈ ఏడాది నవంబర్ 29న బ్లాక్ ఫ్రైడే వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఆరంభం అయ్యాయి. భారత్‌లో కూడా ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను నవంబర్ 24 నుంచి 29 వరకు నిర్వహించనుంది. ఈ మేరకు డేట్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ వదిలింది.
Also Read: AUS vs IND: ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన జస్ప్రీత్ బుమ్రా!
బ్లాక్ ఫ్రైడే సేల్‌లో హోమ్ నీడ్స్, స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తక్కువ ధరలతో లబినుంచనున్నాయి. ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, గ్యాడ్జెట్స్ వంటి ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్‌పై 40 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంది. స్మార్ట్‌టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్.. గృహోపకరణాలపై 75 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి. సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్‌ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుదారులపై 10 శాతం డిస్కౌంట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపైనా డిస్కౌంట్ ఉంటుంది. ప్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా లక్ష వరకు రుణ సదుపాయం ఉంది.