Site icon NTV Telugu

iPhone 16: ఇది కదా బంపరాఫర్‌ అంటే.. సగం ధరకే ఐఫోన్‌..

Black Friday Deal

Black Friday Deal

iPhone 16: ఐఫోన్‌కు ఉన్న క్రేజే వేరు.. ఒక్కసారైనా ఐఫోన్‌ కొనాలి.. అది స్టేటస్‌ పెట్టుకోవాలి.. ఆ ఫోన్‌తో సెల్ఫీ తీసుకోవాలి.. ఇలా యువతరం నుంచి పాత తరం వరకు ఐఫోన్‌కు ఉన్న డిమాండే వేరు.. అది ఎంతలా అంటే.. కొత్త మోడల్‌ వస్తుంది అంటే.. గంటలు, రోజుల తరబడి క్యూలైన్‌లో నిలబడడానికి కూడా వెనుకాడరు.. అయితే, ఇప్పుడు ఐఫోన్‌ను సగం ధరకే దక్కించుకునే అవకాశం వచ్చేసింది.. కొత్త ఐఫోన్ మోడల్స్ లాంచ్ అయిన తర్వాత పాత ఐఫోన్లు చౌకగా మారే అవకాశం ఉంటుంది.. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయిన తర్వాత కూడా, చాలా ఐఫోన్లు చౌకగా మారాయి. ఐఫోన్ 16 విషయానికొస్తే, మీరు ఇప్పుడు రూ.40,000 కి కొనుగోలు చేయవచ్చు.

Read Also: Padmam Silver Jewellery: శ్రీకాకుళంలో పద్మం సిల్వర్ జ్యూయలరి ప్రముఖ సినీ తార రితికా నాయక్ చే ఘనంగా ప్రారంభం

క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ సమయంలో, ఐఫోన్ 16 ను రూ.40,000 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.66,490, అయితే దీనిని రూ.80,000 కు లాంచ్ చేశారు. క్రోమా ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది… దీంతో, రూ.40 వేలకే ఇప్పుడు ఐఫోన్‌ 16 మీ జేబులో పెట్టుకోవచ్చన్నమాట.. కస్టమర్లు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందుతున్నారు. క్రోమా ప్రకారం, అన్ని ఆఫర్లను కలిపి, కస్టమర్లు రూ.40,000 కు ఐఫోన్ 16 ను కొనుగోలు చేయవచ్చు.

క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్ నవంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉండే విషయాన్ని గమనించాలి. కాగా, యాపిల్ గత సంవత్సరం ఐఫోన్ 16 ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో రెండు 48-మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరాలు ఉన్నాయి. ఐఫోన్ 16 A18 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఒక లెన్స్ 48 మెగాపిక్సెల్‌, మరొకటి 12 మెగాపిక్సెల్‌లు. అయితే, ప్రో మోడళ్లలో కనిపించే టెలిఫోటో లెన్స్ దీనికి లేదు.

ఇక, ఐఫోన్ 16 3561mAh బ్యాటరీని కలిగి ఉంది.. ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. స్క్రీన్ 6.1 అంగుళాలుగా ఉంటుంది.. OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది.. ఐఫోన్ 16కు లాంచ్‌ సమయంలో మంచి డిమాండ్‌ ఉంది.. మరి అంత పాత మోడల్‌ కూడా కాదు. ఇప్పుడు ఐఫోన్‌ 16 రూ. 40,000 కు పొందగలిగితే.. అది బంపర్‌ ఆఫర్‌గానే చెప్పుకోవాలి..

Exit mobile version