NTV Telugu Site icon

Tarun Chugh: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే..

Tarun Chugh

Tarun Chugh

Tarun Chugh: రాష్ట్రంలో అమిత్ షా టూర్ సక్సెస్ అయిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి తరుణు చుగ్ అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని వేల మంది బీజేపీ కార్యకర్తల్లో, రాష్ట్ర ప్రజల్లో బాగా జోష్ వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనేనని తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో కొట్లడుతునట్లు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని.. కానీ లోపల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ విషయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ చీకటి స్నేహం బయట పడుతుందన్నారు.

Read Also: Amit Shah: ప్రధాని కుర్చీ ఖాళీగా లేదు.. ముందు సీఎం సీటు కాపాడుకో..

కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల అవినీతి సొమ్ముతో రాజ్యమేలుతోందని తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని, అందుకే బీజేపీ ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా సీట్లు బీజేపీకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Show comments