Garapati Seetharamanjaneya Chowdary: ఏలూరు బీజేపీలో ముసలం ముదిరింది. ఏలూరు పార్లమెంట్ సీటు బీజేపీ నుంచి కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి.. వచ్చే ఎన్నికల్లో స్వయం సేవకుడిగా ఏలూరు పార్లమెంటు నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. రాజకీయాలు అంటే కొన్ని కుటుంబాలు మాత్రమేనా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిస్వార్థంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో.. రాజకీయాల్లోకి రాకముందే నిశ్చయించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు.. బీజేపీ నుంచి టికెట్ వచ్చినా? రాకపోయినా.. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు. ఏలూరు వేదికగా నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఏలూరు జిల్లా నలుమూలల నుంచి బీజేపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ.. బీజేపీ తరఫున ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని గారపాటికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
Read Also: Underwater Metro: ప్రయాణికులకు అందుబాటులోకి అండర్ వాటర్ మెట్రో.. నినాదాలు చేసిన ప్రజలు
కాగా, వచ్చే ఎన్నికల్లో విజయమే టార్గెట్ గా.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుతో ఎన్నికల బరిలో దిగుతోన్న విషయం విదితమే.. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాల, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశమైన.. సీట్ల సర్దుబాటు, కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించారు.. 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో ఎవరు ఎన్ని పోటీచేయాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చారు.. 25లోక్ సభ స్థానాల్లో 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుండగా.. బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించడం జరిగింది. ఇందులో జనసేనకు 21 అసెంబ్లీ , 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.