Satyendra Jain Viral Video: తీహార్ జైలులో సత్యేందర్ జైన్ మసాజ్ చేయించుకుంటున్న వీడియోను విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత, జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సెల్ లోపల జైలు అధికారి ఢిల్లీ మంత్రిని కలిసిన మరో వీడియోను బీజేపీ విడుదల చేసింది. సత్యేందర్ జైలు సందర్శన గంటల తర్వాత తీహార్ జైలు సూపరింటెండెంట్‌ని జైలు గదిలో కలిశారు. జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడిని రాత్రి 8 గంటల తర్వాత తీహార్ జైలు సూపరింటెండెంట్ పరామర్శించారని ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన కొత్త వీడియోలను బీజేపీ విడుదల చేసింది.
ఇటీవల విడుదలైన వీడియోలు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌ను మరింత ఇరకాటంలో పడేశాయి. ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న సత్యేందర్ జైన్.. అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ ఇప్పటికే కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి. ఆయనకు మసాజ్ చేయించుంటున్న వీడియోలు, ఫ్రూట్ సలాడ్ తింటున్న వీడియోలు చర్చనీయాంశంగా మారితే.. ఇప్పుడు జైలు అధికారులతోనే పిచ్చాపాటీ కాలక్షేపానికి సంబంధించిన వీడియో కూడా లీక్ అవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ మరింతగా ఇరకాటంలో పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ, ఆప్ మధ్య నిత్యం మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ వైపు గుజరాత్ ఎన్నికలు, మరోవైపు ఎంసీడీ ఎన్నికల్లో పాగా వేయాలని చూస్తున్న ఆప్‌కు.. సత్యేందర్ జైన్ వీడియోలు తలనొప్పిగా మారాయి. తాజాగా.. విడుదలైన వీడియోలో సత్యేందర్ జైన్, జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ కనిపిస్తున్నారు. ఈ వీడియో సెప్టెంబర్ 12 నాటిదని తెలుస్తోంది. జైన్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చినందుకు జైలు అధికారి అజిత్ కుమార్ సస్పెండ్ చేయబడ్డారు.
steal train engine: రైలు ఇంజిన్‌ను మాయం చేసిన దొంగల ముఠా.. ఎలాగో తెలిస్తే షాకవుతారు?
“తీహార్‌కి సంబంధించిన మరో వీడియోను మీడియా బయటపెట్టింది. ఈసారి సత్యేందర్ కా దర్బార్‌లో జైలు సూపరింటెండెంట్‌ని సస్పెండ్ చేశారు” అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ జై హింద్ ట్వీట్‌లో తెలిపారు. ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు జైలులో ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు లీక్ అయిన వీడియోలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇటీవలి రోజుల్లో, జైలులో ఉన్న మంత్రి తన జైలు గదిలో పచ్చి కూరగాయలు మరియు పండ్లు తింటున్నట్లు తాజా వీడియోలు వెలువడ్డాయి. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేందర్ జైన్‌కు తీహార్ జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో ఆరోపించింది. ఢిల్లీ మంత్రి జైల్లో విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఆధారాలను ఆర్థిక దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది.
#WATCH | More CCTV visuals of jailed Delhi Minister and AAP leader Satyendar Jain in Tihar jail come out: Sources pic.twitter.com/4c6YdJ2bAL
— ANI (@ANI) November 26, 2022