తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంకోవైపు అధికార డీఎంకే కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా పోరాటం చేస్తోంది. తమపై హిందీ భాష బలవంతంగా రుద్దుతోందని నిరసన గళాన్ని రేపుతోంది. ఇలా అధికార-విపక్షాల మధ్య రాజకీయ వార్ మొదలైంది.
ఇది కూడా చదవండి: Nithiin : రాబిన్ హుడ్ ఇది సరిపోదు.. ఇంకా స్పీడ్ పెంచాలి
ఇదిలా ఉంటే సోమవారం డీఎంకే టార్గెట్‌గా బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మద్యం దుకాణాల ముట్టడికి కాషాయ పార్టీ పిలుపునిచ్చింది. లిక్కర్ స్కామ్‌లో వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు పోరాటం చేయాలని కమలనాథులు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ శ్రేణులు, ప్రజలు పోరాటంలో పాల్గొనాలని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కోరారు.
ఇది కూడా చదవండి: IPL 2025: కేకేఆర్‌కు భారీ షాక్.. భారత స్పీడ్‌స్టర్ ఔట్!
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో లిక్కర్ అమ్మకాల ద్వారా వెయ్యి కోట్లు ముడుపులు డీఎంకేకు అందాయని బీజేపీ ఆరోపించింది. ఈడీ సోదాల్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. అక్రమాల నుంచి ప్రజలను డైవర్షన్ చేయడం కోసం రూపి సింబల్ పేరుతో డీఎంకే రాజకీయం చేస్తోందని అన్నామలై ధ్వజమెత్తారు. ఇక బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్నామలై సహా కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: IML 2025: ఫైనల్స్ లో మెరిసిన రాయుడు.. టోర్నీ విజేతగా ఇండియా మాస్టర్స్