Site icon NTV Telugu

BJP Next President: బీజేపీ అధ్యక్ష రేసులో ఆ రాష్ట్ర సీఎం.. ఆర్ఎస్ఎస్ ఫుల్ సపోర్టు..?

Bjp

Bjp

BJP President Race: కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తర్వాత భారతీయ జనతా పార్టీ సారథ్యాన్ని ఎవరు చేపడతారనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థుల పేర్లపై బీజేపీ ఫైనల్ చేయలేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, మరో కేంద్ర మంత్రి కూడా అభ్యర్థుల రేసులోకి ప్రవేశించారని చెబుతున్నారు. అయితే, ఈ అంశంపై బీజేపీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కానీ.. వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా అనేక మంది నాయకుల పేర్లు చాలా కాలంగా చర్చనీయాంశంగా మారాయి.

READ MORE: LIC HFL Recruitment 2025: ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో జాబ్స్.. ఏడాదికి రూ. 19 లక్షల జీతం.. అర్హులు వీరే

న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. అధ్యక్ష రేసులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రి పురుషోత్తం రూపాల పేర్లను బీజేపీ పరిగణలోకి తీసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని కోరే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఇప్పటికే ఫడ్నవీస్‌కి సందేశం అందినట్లు నివేదిక తెలిపింది. బీజేపీ అధ్యక్ష పదవికి ఆయన పేరును పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. వయసులో చిన్నవాడు, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు కూడా ఫడ్నవీస్‌కు ఉందని చెబుతున్నారు. పార్టీ నాయకత్వానికి సైతం ఫడ్నవీస్‌పై నమ్మకం ఉందట. కానీ.. ఈ అంశంపై ఫడ్నవీస్ ఇంకా వ్యాఖ్యానించలేదు. మరోవైపు.. పురుషోత్తం రూపాలాకు సంఘ్ మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. ఆయన ప్రధాని మోడీకి సన్నిహితుడిగా కూడా భావిస్తారు.

READ MORE: Food Poisoning: పోలీస్ శిక్షణ కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్.. 170 మంది ట్రైనీ పోలీసులకు అస్వస్థత..!

ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి?
బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికపై పార్టీ తన వైఖరిని స్పష్టం చేయలేదు. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని ఊహాగానాలు వచ్చాయి. దీనితో పాటు.. ఆశావహుల జాబితాను సిద్ధం చేసిందని, ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత దీనిని పరిశీలిస్తామని చెబుతున్నారు. కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది.

Exit mobile version