Site icon NTV Telugu

Dr K.Laxman: అభివృద్ధి లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

K Laxman

K Laxman

Dr K Laxman comments on jagan govt ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్. అభివృద్ధి లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ.పి ప్రజలను మభ్యపెడుతున్నారు. రాజధానిని అటకెక్కించారు. అమరావతి రైతులపై కత్తి కట్టారు.. ఏపీలో ఇసుక, ఎర్రచందనం, ఖనిజాలు, ప్రకృతి సంపద నిలువునా దోపిడీకి గురవుతున్నాయన్నారు. తెలంగాణ, ఏపీలో కుటుంబ పాలనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్లే విభజన చట్టాలను అమలు చేయడం లేదన్నారు.

Read Also: CP CV Anand : ఆపరేషన్ రోప్ ను ప్రారంభిస్తున్నాం.. ఇక ట్రాఫిక్‌కు చెక్‌

ఏపీలో కేంద్రం నిధులను వైసీపీ పథకాలకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విధానపరమైన నిర్ణయాలు ఏపీకి శాపంగా మారాయి. ఫ్రంట్స్, టెంట్స్ బీజేపీని ఏం చేయలేవు. ఎన్నో పార్టీలు ఏర్పాటయ్యాయి, తరువాత టులెట్ బోర్డులు పెట్టుకున్నారు.. తెలంగాణ సీఎం కేసీఆర్ గత నాలుగేళ్ళుగా జాతీయ పార్టీ, ఫ్రంట్ పేరుతో ఉవిళ్ళూరుతున్నారు…దోచుకున్న ప్రజల డబ్బు, నల్లధనంతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు…కుటుంబ పార్డీలకు తెలంగాణాలో స్థానం లేదన్నారు ఎంపీ లక్ష్మణ్.

Read Also:CP CV Anand : ఆపరేషన్ రోప్ ను ప్రారంభిస్తున్నాం.. ఇక ట్రాఫిక్‌కు చెక్‌

Exit mobile version