Site icon NTV Telugu

Hema Malini: సింగర్‎గా మారిన అలనాటి అందాల నటి

Happy Birthday to Hema Malini

Hema Malini: మధుర ఎంపీ,అలనాటి అందాల నటి, బీజేపీ నాయకురాలు హేమమాలిని భజన గీతం ఆలపించారు. బృందావన్‌లోని రాధా రమణ్‌ ఆలయంలో హేమమాలిని వేదికపైకి వెళ్లి హరే కృష్ణ,హరే కృష్ణ అంటూ భజన గీతం చెబుతుండగా.. ఆలయానికి హాజరైన భక్తులు ప్రముఖ నటి పాడిన భజనను ఆస్వాదించారు.హేమమాలినికి శ్రీకృష్ణుడి పట్ల అమితమై ప్రేమ. ఇప్పటికే పలుమార్లు మధురలోని బృందావన్‌లో ప్రజల ముందు తన భక్తిని ప్రదర్శించింది.

Read Also: SBI Loan:పండుగ పూట కస్టమర్లకు ఎస్బీఐ షాక్.. లోన్స్ ఇక కాస్లీ

రాధా రమణ్‌ ఆలయానికి వెళ్లిన హేమామాలిని ముందుగా అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయంలో భజన గీతాలపన జరుగుతుండగా అక్కడ కూర్చున్నారు. ఆ తర్వాత తనూ వేదికపైకి వెళ్లి ఒక పాడారు. హేమామాలిని పాడినపాటను కింది వీడియోలో మీరూ ఒకసారి వినండి.

Exit mobile version