NTV Telugu Site icon

GVL Narasimha Rao: ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మారిన మోడీ.. ఐదో బలమైన దేశంగా భారత్

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

GVL Narasimha Rao: ఏపీకి ప్రత్యేక నిధులు ఇచ్చారు.. పదివేల నాలుగు వందల కోట్లు ఏపీకి ఇచ్చి కేంద్రం తన ఉదారతను చాటుకుందన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మోడీ మారారు.. 2014 లో బలహీనమైన దేశాల జాబితాలో ఉండేది… మోడీ నాయకత్వంలో ప్రపంచంలో ఐదవ బలమైన దేశంగా ఎదిగిందని తెలిపారు.. నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలన సుభిక్షంగా సాగిందన్న ఆయన.. ఆరున్నర దశాబ్దాల లో భారత దేశం సాధించలేని అద్భుతాలు విజయాలు మోడీ ప్రభుత్వం సాధించిందని తెలిపారు.. కరోనా సమయంలో ఆత్మ నిర్భర భారత్ ద్వారా మన సత్తా చూపించాం.. ప్రపంచానికి మేడ్ ఇన్ ఇండియా వాక్సిన్ అందించామని గుర్తుచేశారు.

Read Also: CM YS Jagan: నిర్మల్‌ హృదయ్‌ భవన్‌కు సీఎం దంపతులు.. అనాథ పిల్లలతో ముచ్చట్లు..

మొబైల్ ఫోన్ ల తయారీ లో ప్రపంచం లో రెండవ దేశంగా భారత్‌ ఎదిగిందన్నారు జీవీఎల్.. కోవిడ్ సమయం లో వంద దేశాలకు మందులు అందించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్న ఆయన.. ఈ దేశం లో వాక్సిన్ తయారు అవ్వక పోతే కొన్ని కోట్ల ప్రాణాలు ప్రమాదంలో పడేవన్నారు.. రెండున్నరేళ్లలో పార్లమెంట్ ఉభయ సభల భవనాలను నిర్మించిన చరిత్ర మోడీ నాయకత్వనిది.. పది కోట్ల మందికి ఉచితం గా గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చాం.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ ఖాయం అన్నారు.. తీవ్రవాద చొరబాట్లు దాడులను అరికట్టిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం.. కొవిడ్ సమయంలో, యుద్ధ సమయంలో విదేశాల నుండి ప్రజలని రక్షించి తీసుకు వచ్చిన ప్రభుత్వం మోడీది అని కొనియాడారు.. గత తొమ్మిదేళ్ళ లో 74 కొత్త ఐర్పోట్ లను నిర్మించాం.. 55 వేల కోట్ల రూపాయల నరెగ నిధులను ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చాం.. 22 లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. ఏపీ కి ప్రత్యేక నిధులు ఇచ్చారు అంటూ కేంద్రంపై ప్రశంసలు కురిపించారు.. చారిత్రాత్మక పార్లమెంట్ భవన ప్రారంభానికి రాజకీయ పార్టీల నేతలు రాక పోవడం వాళ్ళ సంకుచిత మనసును తెలియ జేస్తుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.