Site icon NTV Telugu

Kangana Ranaut: భీమకాళీ ఆలయంలో కంగనా ప్రత్యేక పూజలు..

Kangana

Kangana

ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని మండి జిల్లాలోని భీమకాళీ ఆలయంలో ఇవాళ (సోమవారం) ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చన చేయించారు. అనంతరం అర్చకుల నుంచి తీర్థ ప్రసాదాలను ఆమె స్వీకరించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు కంగనాకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Read Also: Chiranjeevi: చిరంజీవిని హత్తుకుని తెగ ఎమోషనల్ అయిన యూట్యూబర్ అనిల్…!

కాగా, తనను తాను హిమాచల్‌ ప్రదేశ్‌ ఆడబిడ్డగా చెప్పుకుంటున్న కంగనా రనౌత్‌ ఈసారి లోక్‌సభ సభ్యురాలిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె కమలం పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ ప్రతిభాసింగ్‌ను ఆమె ఎదుర్కొబోతున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం వీరభద్రసింగ్‌ కుమార్తెనే ఈ ప్రతిభాసింగ్‌.. ముందుగా మండి నుంచి పోటీకి నిరాకరించిన ప్రతిభ.. బీజేపీ తరపున కంగనా రనౌత్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో తన నిర్ణయం మార్చుకున్నారు.

Exit mobile version