Site icon NTV Telugu

MP Bishnupada Roy: మీరు నాకు ఓటు వేయలేదు.. వారికి గడ్డు రోజులే ఇక..!

Bishnupada Ray

Bishnupada Ray

BJP MP Bishnupada Roy: ‘యాదవులు, ముస్లింలు తనకు ఓటేయలేదు.. వారి కోసం పని చేయను అని జేడీయూ ఎంపీ దేవేశ్‌ చంద్ర ఠాకూర్‌ ఇటీవలి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా కాగా.. తాజాగా అండమాన్‌ నికోబార్‌ భారతీయ జనతా పార్టీ ఎంపీ బిష్ణుపాద రాయ్‌ కూడా సేమ్ ఇలాంటి కామెంట్స్ చేశారు. నికోబార్‌ ప్రజలు తనకు ఓటేయలేదు.. వారికి ఇప్పటి నుంచి గడ్డు రోజులు మొదలైనట్టేనని ఆయన బెదిరింపులకు దిగారు. లోక్‌సభ ఎన్నికలు ఓట్ల లెక్కింపు జరిగిన మరుస రోజు ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌ అవుతుంది.

Read Also: Uttar Pradesh : నగలు నచ్చలేదన్న పెళ్లికూతురు తల్లి.. కోపంతో పెళ్లికి నిరాకరించిన పెళ్లికొడుకు

ఇక, నికోబార్‌ పేరుతో మీరు ( ప్రజలను ఉద్దేశించి) డబ్బులు తీసుకుంటారు.. మందు తాగుతారు.. కానీ, ఓట్లు మాత్రం వేయరు అంటూ బీజేపీ ఎంపీ బిష్ణుపాద రాయ్ పేర్కొన్నారు. జాగ్రత్త.. ఇక, మీకు గడ్డు రోజులు ప్రారంభమైనట్టే అంటూ హెచ్చరించారు. మీ భవిష్యత్త్ ఎంత మాత్రం ఆశాజనకంగా ఉండదు అంటూ ఓటర్లకు రాయ్ వార్నింగ్ ఇచ్చాడు.

Exit mobile version