BJP MP Bandi Sanjay US Tour Schedule Confirmed: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పది రోజుల పాటు ఆయన యూఎస్‌లోనే ఉండనున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 1) తెల్లవారుజామున బండి సంజయ్ యూఎస్‌కు పయనం కానున్నారు. శనివారం (సెప్టెంబర్ 2) అట్లాంటాలో జరిగే ఆప్తా (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) 15 వార్షికోత్సవంలో బీజేపీ ఎంపీ ప్రసంగించనున్నారు.
వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ పర్యటన ఖరారైంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐ సంఘాలతో బండి సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, కళా, సాహిత్య, నాటక, సేవా, వైద్య, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశాల్లో పొల్గొననున్నారు. అమెరికా పర్యటన నేపథ్యంలో ప్రసిద్ధ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై బండి సంజయ్ వీడియోను ప్లే చేయనున్నారు. సెప్టెంబర్ 10న బండి సంజయ్ తిరిగి స్వదేశానికి రానున్నారు.