NTV Telugu Site icon

Babu Mohan: ఈసారి పోటీ చేయడం లేదు.. బీజేపీకి రాజీనామా చేస్తా: బాబు మోహన్

Babu Mohan

Babu Mohan

BJP Leadper Babu Mohan Said I Will Resign from BJP: తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బీజేపీపై ఆ పార్టీ నేత బాబు మోహన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయదల్చుకోలేదని, తాను ఎన్నికలతో సహా పార్టీకి దూరంగా ఉండబోతున్నానని తెలిపారు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి పార్టీకి కూడా రాజీనామా చేస్తా అని బాబు మోహన్‌ స్పష్టం చేశారు. తనను, తన కొడుకును విడదీసే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని మండిపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీజేపీ నేత బాబు మోహన్ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు.

‘సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం బీజేపీ టికెట్ వేరే వాళ్లకు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నా. ఎన్నికలకు, పార్టీకి, పార్టీ ప్రచారాలకు కూడా దూరంగా ఉంటాను. బీజేపీ పార్టీ లిస్టుల పేరుతో చేస్తున్న దాపరికం నచ్చలేదు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి పార్టీకి కూడా రాజీనామా చేస్తా. సోషల్ మీడియాలో నాకు టికెట్ రాదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నాక్కాకుండా నా కొడుకుకు టికెట్ ఇస్తున్నారు అంటూ ప్రచారాలు చేస్తున్నారు. నన్ను, నా కొడుకును విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అనవసరమైన ఊహగానాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆత్మభిమానాని దెబ్బతీస్తే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది’ అని బాబు మోహన్ అన్నారు.

‘బీజేపీ పెద్దలకు ఒకటే చెప్తున్నా.. మీరు అర్హులు అయిన వారికే టికెట్ ఇచ్చుకోండి. నాకు అవమానాలు చాలా జరిగాయి. ఇప్పటికైనా నా మీద మీడియాలో తప్పుడు ప్రచారాలను ఆపండి. నా ఆత్మభిమానం దెబ్బ తినడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నా. నాకు, నా కొడుకుకు మధ్య పోటీ ఏంటి?. బీజేపీ మొదటి జాబితాలో నా పేరు ప్రకటించకపోవడం వల్లే నాపై తప్పుడు ప్రచారాలు మొదలయ్యాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. బండి సంజయ్, కిషన్ రెడ్డి నా ఫోన్ లిఫ్ట్ చేయరు. నన్ను వారు కావాలనే దూరం పెట్టారు’ అని బాబు మోహన్ తెలిపారు.

Also Read: Telangana Elections 2023: మంచిర్యాలలో ‘హస్తం’ అస్తవ్యస్తం.. ఫుల్ స్పీడ్‌లో గులాబీ కార్!

‘ఆందోల్ ప్రజలు నన్ను మూడు సార్లు ఆదరించారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు మంచి నాయకుడు. కానీ ఇక్కడి నేతల తీరు మాత్రం సరిగ్గా లేదు. కనీసం నాకు మొదటి జాబితాలో టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో అన్న విషయంలో పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వకపోవడంతో తీవ్రమైన మనోవేదనకు గురౌతున్నా. వచ్చే లిస్టులో నా పేరు వున్నా నేను పోటీ చేయను’ అని బాబు మోహన్ స్పష్టం చేశారు.

 

 

Show comments