Siddharth Nath Singh: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడులు ఆగవు అని స్పష్టం చేశారు బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో కేంద్ర సంక్షేమ పథకాలు అమలు దాదాపు జరగలేదన్నారు. అమరావతి ఐదు సంవత్సరాలలో రాజధాని కాలేదు.. కానీ, రాబోయే ఐదేళ్లలో అమరావతి రాజధాని అవుతుంది.. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడులు ఆగవు అని పేర్కొన్న ఆయన.. పోలవరం ప్రాజెక్ట్ పునాదులలో లోపాలు జరిగాయి.. పోలవరం డిజైన్ మార్పులు చేశారని వెల్లడించారు.
Read Also: US: అమెరికాలో కిడ్నాపైన హైదరాబాద్ స్టూడెంట్ హత్య
ఇక, అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్ధుల విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు సిద్ధార్థ నాథ్ సింగ్. ఉగాది భారతదేశానికి, తెలుగువారికి చాలా ముఖ్యమైన రోజుగా పేర్కొన్న ఆయన.. ఉగాది పండుగ ఏపీలో జరుపుకోవడం అద్భుతంగా ఉందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న చోట సంక్షేమం అమలు చేయడం సాధ్యపడింది.. కానీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం కేంద్ర సంక్షేమ పథకాలు అమలు దాదాపు జరగలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపుకోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్.
