NTV Telugu Site icon

Gun Fire: పెళ్లి కాస్త లొల్లి అయింది.. కాల్పుల్లో బీజేపీ నేత కుమారుడి మృతి

Gun Fire

Gun Fire

Gun Fire: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో జరిగిన పెళ్లివేడుకలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా చేసిన ఓ పని బాలుడి ప్రాణం తీసింది. అతను స్థానిక బిజెపి నేత కొడుకు కావడంతో విషయం వేగంగా వ్యాపించింది. గోరియలోని లక్ష్మీ గంజిలో శనివారం రాత్రి భారతీయ జనతా పార్టీ నేత బంధువుల పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుకలో బీజేపీ నేత కుమారుడు ప్రియాన్షు (15) హాజరయ్యాడు. పెళ్లి హడావుడి అర్ధరాత్రి వరకు కొనసాగింది. వేడుకలన్నీ పూర్తయిన తర్వాత పెళ్లికి హాజరైన బంధువుల్లో రాజేష్ యాదవ్ అనే వ్యక్తి.. తన దగ్గరున్న సర్వీస్ రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. ఈ క్రమంలోనే బుల్లెట్ అదుపుతప్పి ప్రియాన్షు కడుపులోకి దూసుకుపోయింది. ఏమైందో అర్థం అయ్యేలోపే ప్రియాన్షు స్పాట్ లోనే కుప్పకూలిపోయాడు.

Read Also : Instagram : ఇన్ స్టాలో ఇంటికి రమ్మన్నాడు.. వాడుకుని వీడియో తీశాడు

ఇది గమనించిన బంధువులు ప్రియాన్షును స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి విషమించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదే విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. కాల్పుల జరిపిన విషయం పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన నిందితుడు రాజేష్ యాదవ్ పై కేసు నమోదు చేశారు. కాగా, ప్రియాన్షు మృతి చెందగానే.. భయపడిన రాజేష్ యాదవ్ పరారయ్యాడు. ప్రియాన్షు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రియాన్షు తండ్రి భరత్ యాదవ్ ప్రస్తుతం బిజెపి కార్పొరేటర్ గా ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అకస్మాత్తుగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read Also: IT raids: తమిళనాడులో ఐటీ దాడులు.. జి స్క్వేర్‌ సంస్థలో తనిఖీలు

Show comments