Site icon NTV Telugu

PV Chalapathi Rao Passes Away: బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతి రావు కన్నుమూత

Pv Chalapathi Rao

Pv Chalapathi Rao

PV Chalapathi Rao Passes Away: బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు పీవీ చలపతిరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు.. ఆరిలోవ పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. పీవీ చలపతిరావు కుమారుడు పీవీ మాధవ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా తన సేవలను అందిస్తున్నారు. పీవీ మాధవ్ ప్రస్తుతం బీజేపీ శాసనమండలి పక్షనేతగా ఉన్నారు.

CM Jaganmohan Reddy: ఈ నెల 3న రాజమహేంద్రవరం పర్యటనకు సీఎం జగన్‌

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన మాజీ శాసన మండలి సభ్యులు పీవీ చలపతిరావు ఆకస్మిక మరణం పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ ప్రారంభ దశకంలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన చలపతిరావు తమ మార్గదర్శకులుగా నిలిచారన్నారు. కార్మిక సంఘ నాయకులుగా విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం శాసనమండలి సభ్యులుగా చలపతిరా చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. రాష్ట్రంలో నాటి జనసంఘ పార్టీ అభివృద్ధికి కృషిచేసిన ప్రముఖుల్లో చలపతి రావు ఒకరు.

Exit mobile version