Madhavi Latha: ప్రముఖ బీజేపీ పార్టీ నాయకురాలు కోంపెల్ల మాధవీ లత, టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన రాజమౌళిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మాధవీ లత గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో మాట్లాడిన వ్యాఖ్యలపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆమె చేసిన పోస్టులో.. డైరెక్టర్ రాజమౌళిని ఉద్దేశిస్తూ.. ఆయన “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చేసిన ప్రకటనపై అభిప్రాయాన్ని తెలిపారు.
Shocking : వంద కోట్ల హీరో సినిమా.. శాటిలైట్, డిజిటల్ రైట్స్ కాకుండానే రిలీజ్ కు రెడీ
రాజమౌళి లాంటి గొప్ప వ్యక్తి మాట్లాడినప్పుడు, అది కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా మిగలదు. లెక్కలేనన్ని యువత మనస్సులపై ప్రభావం చూపే సందేశంగా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. విశ్వాసం బలహీనత కాదు, వినయం పాతబడలేదు, మన మూలాలను అగౌరవపరచడం ఎప్పుడూ సృజనాత్మకత కాదని ఆమె పేర్కొన్నారు. విజయం వివేకాన్ని పెంచాలి తప్ప, విలువలను తగ్గించకూడదని ఆమె అన్నారు. ప్రజలు రాజమౌళిని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి, ఆయన బాధ్యతాయుతంగా మాట్లాడాలని మాధవీ లత గారు ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.
