తెలంగాణ టీఎన్జీవో సంఘం రాజేంద్రతో పాటు వారి సంఘం అధికార పార్టీ అభ్యర్థికి ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నారని బుద్ధ భవన్‌లో సీఈవో కి బీజేపీ నాయకుల ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీఅధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ప్రచారం చేసినందుకు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో నాగార్జునసాగర్ ఎన్నికల సమయంలోనూ ఇలా టీఎన్జీవోలు అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని, ఒక రాజకీయ పార్టీకి గతంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సందర్భంగా టీఎన్జీవో సంఘం మద్దతు ఇచ్చినందుకు ఫైన్ వేశారన్నారు. అవసరమైతే మేము క్రిమినల్ కేసు పెడతామని, ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు దిష్టిబొమ్మ దగ్ధం చేశారంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకుంటే దానిపైన మేము పోరాడుతాము. న్యాయస్థానంలోనూ పోరాటం చేస్తామన్నారు. ఎంప్లాయిస్ ఎవరు వారికి మద్దతు ఇవ్వరు అసోసియేషన్ నాయకులు ఈ విధంగా వ్యవహరించడం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
Also Read : China : లాక్ డౌన్ ప్రకటనతో గోడలుదూకి పారిపోతున్న ప్రజలు..
రాజగోపాల్ రెడ్డి అకౌంట్ నుండి డబ్బులు బదిలీ అని వచ్చిన ఆరోపణపై వివరణ ఇచ్చామని, అవన్నీ ఫేక్ అకౌంట్లు అని, ఒక వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఏ విధంగా బయటికి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. దానిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరామన్నారు. అనంతరం బీజేపీ లీగల్ సెల్ రచన రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేలా టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందన్నారు. సుషి సంస్థలో నేను డైరెక్ట్ గా లేను అని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. బయటికి వచ్చినటువంటి అకౌంట్ లు ఫేక్ అవన్నీ టిఆర్ఎస్ సృష్టించిందని మేము అనుకుంటున్నాము.
Also Read : China : లాక్ డౌన్ ప్రకటనతో గోడలుదూకి పారిపోతున్న ప్రజలు..
ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు జమ చేశారని ఆరోపించారో వారి స్టేట్మెంట్లు ఇచ్చాము. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఉద్యోగులు బహిరంగంగా ఎలాంటి పొలిటికల్ పార్టీకి ప్రచారం చేయవద్దు. మిగతా ఉద్యోగుల ఓటు హక్కును భంగపరుస్తున్నారు. టీఎన్జీవో అసోసియేషన్ పై క్రిమినల్ చర్యలు, డిసిప్లిన్ చర్యలు తీసుకోవాలి. నాగార్జునసాగర్ లో చేసిన తప్పే మునుగోడు ఎన్నికల్లోను చేస్తున్నారు. మునుగోడు లో ఉన్న బిజెపి లీడర్ల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఫిర్యాదు చేశాము అని ఆమె వ్యాఖ్యానించారు.
