BJP Leader Chiantala Ramachandra Reddy Fires on TRS
తెలంగాణలో రోజు రోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. అయితే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పుడు తెలంగాణ రాజకీయం దాని చుట్టే తిరుగుతోంది. అయితే తాజాగా బీజేపీ మాజీ ఎమ్మేల్యే చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవంపై కేసీఆర్ గతంలో ఒకమాట.. ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారన్నారు. అంతేకాకుండా.. మేము విమోచన దినోత్సవం జరుపుతాం.. మీరు ఏ పేరు మీద అయినా వేడుకలు జరుపుకోండి… చరిత్రను కేసీఆర్ వక్రీకరిస్తున్నారు. రాబోయే తరాలకు చరిత్ర తెలియాలని బీజేపీ పాటు పడుతోంది. సెప్టెంబర్ 17 న కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వస్తున్నారు. బీజేపీ నేతల కృషి వల్లే రాష్ట్ర ప్రభుత్వం తలవంచి వేడుకలు నిర్వహిస్తోంది. మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు..
ఇష్టం వచ్చినట్టు పోస్ట్ లు పెడుతున్నారు.. అలా చేస్తున్న వారి పై చర్యలు లేవు. బీజేపీ నేతలను మాత్రం అరెస్టులు చేశారు. అమిత్ షా హాజరయ్యే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు వ్యతిరేకించిన అసదుద్దీన్ కూడా త్రివర్ణ పతకాలు పట్టుకొని ర్యాలీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులను కలవడంతో పాటు సన్మానిస్తాం. వారు బతికిలేకుంటే వారి కుటుంబ సభ్యులను కలుస్తాం. పార్టీకి సంబంధించిన వాల్ పోస్టర్లు కాకున్నా టీఆర్‌ఎస్ నేతలు వాటిని చింపుతున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
