NTV Telugu Site icon

Haryana Elections: ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీకి బీజేపీ లేఖ.. కారణాలు ఇవే..

Election Commission

Election Commission

హర్యానాలో అక్టోబర్ 1న జరగాల్సిన పోలింగ్ ను నిలిపేయాలని భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల కమిషన్‌ను అభ్యర్థించింది. సుదీర్ఘ వారంతపు సెలవుల( లాంగ్ వీకెండ్) కారణంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్నికల తేదీకి ముందు, తర్వాత సెలవులు ఉన్నాయని.. దీంతో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని లేఖలో పేర్కొంది. శనివారం, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ మోహన్‌లాల్ బడోలి కమిషన్‌కు లేఖ పంపినట్లు రాష్ట్ర బిజెపి నాయకుడు ఒకరు తెలిపారు. ఆగస్టు 22న ఈ-మెయిల్ ద్వారా కమిషన్‌కు లేఖ కాపీ అందిందని హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ ధృవీకరించారు. రాష్ట్ర బీజేపీ నుంచి లేఖ పంపినట్లు అగర్వాల్ తెలిపారు.

READ MORE: HYDRA Comissioner : కూల్చివేతల వెనుక రాజకీయ హస్తం ఉందా.? హైడ్రా కమిషనర్‌ సంచలన ఇంటర్వ్యూ

” అక్టోబర్ 1న పోలింగ్ జరగాల్సి ఉంది. కాగా..28వ తేదీ శనివారం, 29వ తేదీ ఆదివారం వచ్చాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలకు ఒక వీక్లీ హాలిడే ఉంటుంది. అక్టోబర్ 1న పోలింగ్ రోజు కూడా చట్టప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడతాయి. 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా నేషనల్ హాలిడే ఉంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకూ హాలిడేల పొడిగింపు వల్ల ఓటింగ్ శాతం తగ్గేందుకు అవకాశం ఉంది. వీటికి తోడు, హర్యానాలో గణనీయంగా ఓటర్లున్న బిష్ణోయ్ కమ్యూనిటీ వారు రాజస్థా్న్‌లోని ముఖమ్ గ్రామంలో జరిగే వార్షిక యాత్రకు వెళ్తుంటారు. ఆ కారణంగా వారు అక్టోబర్ 1న పోలింగ్‌కు హాజరయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా ఓటింగ్ శాతం జరిగేందుకు వీలుగా మరో తేదీన ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. గతంలో కూడా ఓటింగ్ తేదీలను పండుగల కారణంగా వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి” అని ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

READ MORE:Tirumala: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో సమీక్ష

కాగా.. హర్యాన అసెంబ్లీకి చివరిసారిగా 2019లో ఎన్నికలు జరిగాయి. హర్యాన అసెంబ్లీ ఎన్నికల గడువు నవంబర్ 3తో ముగుస్తుంది. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో 46స్థానాలు వచ్చిన వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధఇంచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. జననాయక్ జనతా పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.