NTV Telugu Site icon

BJP: సందేశ్‌ఖాలీ బాధితురాలికి బీజేపీ ఎంపీ టికెట్..

Sandeshkali

Sandeshkali

పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ లోక్‌సభ స్థానం నుంచి రేఖ పాత్రకు బీజేపీ టికెట్ ఇచ్చింది. చాలా రోజులుగా చర్చలో ఉన్న సందేశఖలీ ఈ నియోజకవర్గంకిందకే వస్తుంది. టీఎంసీ నేత షాజహాన్ షేక్ చేష్టలను బయటపెట్టిన మహిళల్లో రేఖా పాత్ర ఒకరు.. సందేశ్‌ఖాలీ ఉద్యమానికి ఆమె ప్రధాన పాత్ర పోషించారు. షాజహాన్ తన భూమిని ఆక్రమించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని రేఖా పాత్ర ఆరోపించింది. ఈ విషయంపై జాతీయ స్థాయిలో వెళ్లడంతో TMC షాజహాన్ షేక్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందికి పైగా అరెస్టు అయ్యారు.

Read Also: Rohit -Hardik Pandya Fans Fight: స్టేడియంలో పొట్టు పొట్టు కొట్టుకున్న రోహిత్- హార్దిక్ ఫ్యాన్స్..

బీజేపీ టికెట్ లభించిన అనంతరం రేఖ పాత్ర ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. తాను ఎల్లవేళలా గ్రామంలోని మహిళలకు అండగా ఉంటానని అన్నారు. బసిర్‌హత్‌తో పాటు సందేశ్‌ఖాలీ ప్రజలకు సేవ చేసే అవకాశం బీజేపీ నాకు కల్పించిందని ఆమె తెలిపారు. బీజేపీ సందేశ్‌ఖాలీలో ఆనంద వాతావరణం నెలకొందన్నారు. నేను ఫిర్యాదు చేయడంతో షేక్ షాజహాన్, శిబు హజ్రా, ఉత్తమ్ సర్దార్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోని 42 స్థానాలకు గాను 38 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. డైమండ్ హార్బర్, అసన్సోల్, బిర్భమ్, జార్గ్రామ్‌లలో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అలాగే, తూర్పు మిడ్నాపూర్‌లోని తమ్లుక్ నుంచి కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయకు బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. కోల్‌కతా నార్త్ నుంచి తపస్ రాయ్ బరిలోకి దిగుతున్నారు.

Show comments