Bjp Candidate 2nd List 2024: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశం అయింది. ఇటీవలే మొదటి జాబితాను విడుదల చేసిన బీజేపీ అధిష్టానం.. ఈరోజు రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. రెండో జాబితాలో 90 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ జోషి, నిత్యానంద్ రాయ్ సహా పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, బీహార్, హిమాచల్ ప్రదేశ్ మరియు తెలంగాణలలోని లోక్‌సభ స్థానాలపై చర్చలు జరిగాయట. ఈ సమావేశంలో 90 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Virat Kohli-IPL 2024: ఆర్‌సీబీకి శుభవార్త.. ‘కింగ్’ కోహ్లీ వచ్చేస్తున్నాడు!
గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు సహా కొత్తగా పార్టీలో చేరిన ప్రముఖుల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉండనుంది. బీహార్, తమిళనాడు, ఒడిశాలో సంకీర్ణ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కానుందట. ఇక తొలి జాబితాలో 195 మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి జాబితాలో తెలంగాణకు సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో లిస్టులో 8 మందిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.