Site icon NTV Telugu

Arun singh : ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ

Arun Singh Bjp

Arun Singh Bjp

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగి నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుల్ సింగ్, మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో బీజేపీ జెండా ఆవిష్కరణతో పాటు, బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కార్యకర్తల ఉన్న పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఉన్నది బీజేపీలోనేని ఆయన తెలిపారు.

Kishan Reddy: పార్టీ ఫిరాయింపులు మీద తప్ప గ్యారంటీల మీద దృష్టి లేదు.. సీఎంపై కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడోసారి బిజెపి అధికారం చేపట్టడం ఖాయమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాష్ట్రంలో ఐఏఎం,ఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్, మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు ఘనత బీజేపీదేనని అరుణ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. మొలకలచెరువు నుంచి మదనపల్లి మీదుగా తిరుపతికి రూ.1400 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సంపూర్ణ సహకారం, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ అరుల్ సింగ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Asaduddin Owaisi: భారత్లో పేదలు, ముస్లీంలు లేకుండా చేయాలని చూస్తున్నారు..

Exit mobile version