Site icon NTV Telugu

Navneet Rana: అమిత్ షాను కలిసిన నవనీత్ కౌర్ దంపతులు

Home

Home

ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను నవనీత్ కౌర్ దంపతులు కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు. ఇటీవలే నవనీత్ కౌర్‌కు మహారాష్ట్రలోని అమరావతి నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నవనీత్ కౌర్ పేరును ప్రకటించింది. గతంలో 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం బీజేపీకి దగ్గరయ్యారు. తాజాగా అదే సీటు బీజేపీ నుంచి లభించింది. దీంతో బీజేపీ ముఖ్య నేతలను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గురువారం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్‌ను కూడా ఈ దంపతులు కలిశారు.

 

అమిత్ షాతో భేటీ అనంతరం నవనీత్ కౌర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీతో తాను కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. అందుకోసమే అమిత్ షా ఆశీర్వాదం కోసమే ఢిల్లీ వచ్చినట్లు వెల్లడించారు. అమరావతి ప్రజల తరపున హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పుకొచ్చారు. ఇక ప్రధాని మోడీ పిలుపు ఇచ్చినట్లుగా 400 సీట్లలో అమరావతి కూడా ఒకటిగా ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మోడీ కలను తాను నెరవేరుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Steve Smith: ప్రపంచంలో అతనే బెస్ట్ ప్లేయర్.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ కీలక వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా రెండు నెలల పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Vasooli Titans: ప్రధాని మోడీపై మహిళా క్రికెటర్ ‘వసూలీ టైటాన్స్’ పోస్ట్.. వైరల్ కావడంతో డిలీట్..

 

Exit mobile version