NTV Telugu Site icon

BJLP Meeting: అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. బీజేఎల్పీ సమావేశంలో మహేశ్వర్ రెడ్డి

Maheshwar Reddy

Maheshwar Reddy

ఈరోజు సాయంత్రం బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.

Read Also: Australia: ఘోరం.. రైలు ఢీకొని భారతీయ టెకీ, కుమార్తె మృతి

ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 45 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు ఈ ప్రభుత్వం కుదించిందని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది.. ప్రజా సమస్యలపై చర్చిండానికి టైమ్ లేదా ? అని ప్రశ్నించారు. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. అక్కడ నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చి సమావేశాలకు హాజరు అవుతామని మహేశ్వర్ రెడ్డి అన్నారు. తక్కువ టైంలో ఎక్కువ అవినీతి మూటగట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని ఆయన పేర్కొ్న్నారు.

Read Also: Off The Record: మరో వివాదంలో స్మితా సభర్వాల్‌.. దేశం మొత్తం కేరాఫ్ కాంట్రవర్సీగా ఐఏఎస్ అధికారి..!

Show comments