NTV Telugu Site icon

Bitcoin : 26నెలల తర్వాత 56000వేల డాలర్లకు చేరిన బిట్ కాయిన్

Bitcoin

Bitcoin

Bitcoin : క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులకు శుభవార్త.. తాజాగా దాని ధరలో భారీ జంప్ కనిపిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర ఫిబ్రవరి 27న 56,000డాలర్లకి చేరుకుంది. ఇది 26 నెలల తర్వాత అంటే 2 సంవత్సరాల 2 నెలల తర్వాత ఈ పెరుగుదల కనిపించింది. ఈ స్థాయిలు చివరిగా డిసెంబర్ 2021లో కనిపించాయి. అయితే మునుపటి నెలలో అంటే నవంబర్ 2021లో బిట్‌కాయిన్ దాని ఆల్-టైమ్ హై రేట్ 69,000డాలర్లకి చేరుకుంది.

బిట్‌కాయిన్ మళ్లీ ఎందుకు పెరుగుతోంది?
అమెరికాకు చెందిన ప్రముఖ క్రిప్టో ఇన్వెస్టర్, సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రో స్ట్రాటజీ.. ఇటీవల 155 మిలియన్ డాలర్లు వెచ్చించి 3 వేల బిట్ కాయిన్లను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీనికి తోడు బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కు అమెరికా ఆమోదం తెలపడం కూడా క్రిప్టో కరెన్సీలు రాణించేందుకు మరో కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంతోనే బిట్ కాయిన్ లో చాలా రోజుల తర్వాత మళ్లీ కొనుగోళ్లు వెల్లువెత్తున్నట్లు పేర్కొంటున్నాయి.

Read Also:Gachibowli Drugs Case: గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు..

నేటి బిట్‌కాయిన్ ధర
Bitcoin ప్రస్తుతం 9.26 శాతం పెరుగుదలతో టోకెన్‌కు 56,062.02డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత నెలలో పెట్టుబడిదారులు 9 క్రిప్టోకరెన్సీ ఇటిఎఫ్‌లలో 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఇన్వెస్టిమెంట్ చేశారు. బిట్‌కాయిన్ ఇటిఎఫ్‌ని అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఇసి) ఆమోదించింది. దీని తరువాత, కొత్త పెట్టుబడిదారులు బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టాలని భావించారు.

జనవరి 22 బిట్‌కాయిన్ క్షీణతకు పెద్ద రోజు. ఇది ఏడు వారాల్లో కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత బిట్‌కాయిన్ రేటు ఆ సమయంలో 35,000డాలర్ల కంటే తక్కువగా పడిపోయింది. ప్రజలు తరచుగా బిట్‌కాయిన్ రేటును ఆసక్తిగా గమనిస్తుంటారు.ఎందుకంటే ఇది అధిక రిస్క్-అధిక రాబడి ఆస్తి. 2010 – 2020 సంవత్సరాలలో ఇది అసాధారణమైన 9,000,000 శాతం (సోర్స్-కాయిన్‌డెస్క్) రాబడిని ఇచ్చింది.

Read Also:TDP-Janasena Public Meeting: నేడు టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభ.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌