Birla returns: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా మళ్లీ వొడాఫోన్-ఐడియా బోర్డులోకి వచ్చారు. ఈ నెల 20వ తేదీ నుంచి అడిషనల్ డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇచ్చారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి వొడాఫోన్-ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్‌కి 18 పాయింట్ సున్నా ఏడు శాతం వాటా ఉంది.
read more: Keshub Mahindra: 99 ఏళ్ల వయసులో కన్నుమూత.. వందేళ్ల స్ఫూర్తిదాత..
దీంతో.. కుమార్ మంగళం బిర్లా రెండేళ్ల కిందటి వరకు వొడాఫోన్ ఐడియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యహరించారు. తర్వాత.. వైదొలిగారు. మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ అయిన వొడాఫోన్-ఐడియా ప్రస్తుతం భారీగా అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.
ఈ సంస్థ 2 పాయింట్ రెండు మూడు లక్షల కోట్ల రూపాయల రుణ భారంతో రోజురోజుకీ కుంగిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 బిలియన్ డాలర్ల బకాయిలను ఈక్విటీలుగా మార్చుకుంది. తద్వారా ఆ కంపెనీలోని అతిపెద్ద షేర్ హోల్డర్‌గా అవతరించింది.
2021 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం.. అప్పుల్లో కూరుకుపోయిన టెలికం కంపెనీలను ఆదుకునేందుకు ప్యాకేజీని ప్రకటించింది. అయినప్పటికీ వొడాఫోన్-ఐడియా పనితీరు ఏమాత్రం మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌కి చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ కృష్ణకిషోర్ మహేశ్వరి.. వొడాఫోన్-ఐడియా బోర్డులోని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు.
ఫలితంగా.. కుమార్ మంగళం బిర్లా పున:ప్రవేశించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో.. వొడాఫోన్-ఐడియా దశ తిరుగుతుందా అని ఆ సంస్థ ఉద్యోగులతోపాటు వినియోగదారులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలతో పోల్చితే వొడాఫోన్-ఐడియా సర్వీసుల పట్ల యూజర్లు అసంతృప్తితో ఉన్నారు.
అందుకే.. ప్రతినెలా కొన్ని లక్షల మంది ఇతర నెట్‌వర్క్‌లకు మారుతున్నారు. కుమార్ మంగళం బిర్లా రాకతో వొడాఫోన్-ఐడియా తిరిగి పట్టాలెక్కుతుందని భావిస్తున్నారు. ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందని ప్రచారం చేశారు. మరి.. బిర్లా రీఎంట్రీ ఐడియా.. ఈ కంపెనీ జీవితాన్ని మారుస్తుందో లేదో వేచి చూడాలి.