Site icon NTV Telugu

Viral Video: భలే పిట్ట గురూ ఇది.. దొంగతనం చేసి యజమానికి ఇస్తున్న పక్షి

Bird

Bird

Bird Stealing Money From Streets: మనం రకరకాల దొంగతనాలను చూసుంటాం. పక్కన ఉన్న షాపులో నుంచి కన్నం వేసి గోల్డ్ షాపులోకి చొరబడం, పక్కింట్లో దొంగతనం చేయడం, రాత్రుళ్లు దోపిడికి రావడం, ఈ మధ్య బ్యాంకులో దొంగతనానికి వచ్చి ఏం దొరకక గుడ్ బ్యాంక్ అని లెటర్ రాసి పెట్టి వెళ్లడం, ఇంకా దొంగతనానికి వచ్చి ఇంట్లో వండుకొని తిని వెళ్లడం లాంటి చాలానే ఫన్నీ వీడియోలు చూసుంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయే దొంగతనం వీటన్నింటికి కంటే ఫన్నీగా చూస్తేనే నవ్వు వచ్చేలా ఉంటుంది. ఇంతకీ ఆ దొంతతనం చేసింది ఏ ప్రొఫెషినల్ దొంగో, లేక అనుభవం లేక పట్టుబడిపోయిన దొంగోకాదు. ఓ పిట్ట ఈ దొంగతనం చేసింది. వింటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఇక చూస్తే షాక్ అవ్వాల్సిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను అటహరెకట్‌ ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

Also Read: Viral Video: ఇది నిజంగానే ఘోస్ట్ రైలా? ఇంజిన్ లేకుండా వెళ్లిన ట్రైన్

ఈ వీడియోలో ఓ పిట్ట బయట వీధిలో నుంచి ఇంట్లోకి రావడం మనం చూడవచ్చు. ఆ పక్షి నల్లగా ఉంది. దానిలో నోటిలో మనం కరెన్సీ నోట్లు చూడవచ్చు. అది ఎగురుకుంటూ వచ్చి నేరుగా ఇంట్లో ఉన్న ఒక డ్రాయర్ వద్ద ఆగుతుంది. కొంచెం సేపటికి ఆ సొరుగు తెరుచుకుంటుంది. వెంటనే ఆ పిట్ట ఆ నోటును దానిలో వేస్తుంది. ఇక్కడ వింతైనా విషయం ఏంటంటే ఈ సొరుగులో చాలా కరెన్సీ నోట్లు ఉన్నాయి. అంటే ఆ పిట్ట అన్ని నోట్లను కొట్టేసి ఇంట్లో తెచ్చి పెట్టి ఉంటుంది. పిట్ట నోట్లను డ్రాయర్ లో వేస్తూ ఉండగా పెంపుడు కుక్క దాని వద్దకు వస్తుంది. అది ఎలా వేస్తుందో అని నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇలాంటి పిట్ట ఒక్కటి ఉంటే చాలు పనిచేయకుండా బతికేయొచ్చు అని కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఇదంతా ఫేక్ వీడియో అని కొట్టిపడేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఈ పిట్టకు ఇలా ట్రైనింగ్ ఇచ్చిన వారు చాలా గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇలా కూడా దొంగతనాలు జరిగితే మేం ఏం చేయాలి బాబు అంటూ మరికొందరు వాపోతున్నారు.

Exit mobile version