World Record : కాస్త నడవండి బాబు.. అంటేనే ఈ రోజుల్లో జనాలు వాకింగా కాళ్లు నొప్పి లేవవు అంటారు.. అలాంటిది ఓ పక్షి ఏకంగా 13560కిలోమీటర్లు తిండి తిప్పలు లేకుండా ప్రయాణించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసింది. పొడవాటి తోకతో ఉండే గాట్‌విట్ పక్షి ఈ ఫీట్‌ను సాధించి పాత గిన్నిస్ రికార్డును తిరగరాసింది. అలస్కా నుంచి ఆస్ట్రేలియాలోని టాస్మేనియా వరకు ఈ పక్షి 11 రోజుల పాటు అలుపెరుగని ప్రయాణం సాగించింది. కనీసం ఆహారం, నీటి కోసం కూడా దిగకుండా 8,435 మైళ్లు (13,560 కిలోమీటర్లు) ప్రయాణించినట్టు గిన్నిస్ వరల్డ్ ప్రతినిధులు తెలిపారు.
Read Also: Ambulance Incident : డబ్బులు డిమాండ్ చేసిన డ్రైవర్ పై యాక్షన్ కు ఆదేశాలు
గాడ్ విట్ అనే ఈ పక్షి చాలా దూరం ఎగరగలదని తెలుసు కానీ ఎంత దూరమో పరీక్షించాలనుకున్నారు మన పరిశోధకులు. అందుకే దీని కాళ్లకు 234684నెంబర్ తో 5జీ శాటిలైట్ ట్యాగ్ కట్టారు. తర్వాత వదిలేశారు. అక్టోబర్ 13వ తేదీన దాని ప్రయాణం మొదలైంది. మొత్తం పదకొండు రోజులు ఎక్కడా ఆగకుండా.. అమెరికాలోని అలస్కా నుంచి వలస మొదలుపెట్టి ఆస్ట్రేలియాలోని టాస్మానియాకు చేరుకుంది. ఈ పక్షి ప్రయాణించిన దూరం భూమి పూర్తి చుట్టుకొలతలో మూడోవంతు. లండన్ నుంచి న్యూయార్క్ మధ్య రెండున్నర సార్లు ప్రయాణించినంత దూరం. గతంలో ఇదే జాతికి చెందిన మరో పక్షి 217 మైళ్ళు ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఇప్పడు ఇది. అయితే ఇది 11 రోజులు ఏమీ తినకుండా, తాగకుండా ట్రావెల్ చేయడం వలన సగం బరువు తగ్గిపోయిందట.