NTV Telugu Site icon

Bike Accident : ప్రాణం తీసిన అతివేగం.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

Accident

Accident

అతివేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. గ్రేటర్‌ పరిధిలోని కాప్రా సర్కిల్‌ కుషాయిగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ కమలానగర్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలయ్యాయి. ఈసీఐఎల్‌ నుంచి రాధిక చౌరస్తా వైపు బైక్‌పై ఇద్దరు యువకులు వెళ్తున్నారు. కమలానగర్‌ బస్టాప్‌ వద్ద రోడ్డు మలుపు ఉంది. అతివేగం అపై రోడ్డు మలుపు.. బైక్‌పై వెళ్తున్న యువకులకు బైక్‌ అదుపుతప్పింది. డివైడర్‌ను ఢికొట్టి క్షణాల్లో ఒకరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
Also Read : Clash Between two Groups: రెండు వర్గాల మధ్య హింసాత్మక పోరాటం.. ముగ్గురు మృతి

ప్రమాదం జరిగిన తీరు ఓ షూటింగ్‌ మాదిరిగా ఉందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో కూడా అర్థకాని పరిస్థితి. బైక్‌ అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెనకాల కూర్చున్న వ్యక్తి గాల్లోకి ఎగిరాడు. పైనున్న విద్యుత్‌ తీగలపై పడి అక్కడ నుంచి డివైడర్‌ మధ్యలో ఉన్న చెట్లపై పడి డివైడర్‌ మధ్యలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. వెనకున్న వ్యక్తి తీవ్రగాయాలతో బయటపడ్డారు. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌పై ఉన్న ఇద్దరిలో మృతి చెందిన వ్యక్తి స్థానికుడు కాగా.. గాయాలపాలైన వ్యక్తి సిద్దిపేటకు చెందనవారుగా తెలిసింది.

Also Read : Jawan Firing: గుజరాత్ ఎన్నికల విధుల్లో సహోద్యోగులపై జవాన్ కాల్పులు.. ఇద్దరు మృతి