NTV Telugu Site icon

Uttar Pradesh: ఏం జరుగుతుందో తెలిసే లోపే నది మధ్యలో చిక్కుకున్న బస్సు.. షాకింగ్ వీడియో

New Project (1)

New Project (1)

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో, కత్వాలి నది నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీని కారణంగా హరిద్వార్ నజీబాబాద్ రహదారిపైకి నీరు భారీగా వచ్చి చేరింది. ఇంతలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నీటి ప్రవాహంలో చిక్కుకుంది. బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. దాని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బలమైన నీటి ప్రవాహం మధ్యలో బస్సు చిక్కుకుపోయింది. బస్సులో చిక్కుకున్న వారిని రక్షించే పనిలో స్థానికులు నిమగ్నమయ్యారు.

బస్సు నీటిలో బోల్తా పడకుండా క్రేన్‌ను రంగంలోకి దించారు. ఈ క్రేన్ సాయంతో బస్సులోని ప్రయాణికులను రక్షించేందుకు కసరత్తు జరుగుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బస్సులో దాదాపు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. దీంతో అక్కడికక్కడే గందరగోళ పరిస్థితి నెలకొంది.

Read Also:Project K: ‘కల్కి’లో అతిపెద్ద సస్పెన్స్ ఇదే…

2016లో కోటవలి నదిపై నిర్మించిన వంతెన పాడైందని చెబుతున్నారు. దీనివల్ల ఏ వాహనం అయినా వంతెన కింద నుంచి వెళుతుంది. వర్షం కారణంగా కత్వాలి నది నీటిమట్టం పెరగడంతో వంతెన దిగువ భాగంలోకి కూడా నీరు వచ్చి చేరింది. ఇంతలో బలమైన నీటి ప్రవాహంలో బస్సు చిక్కుకుపోయింది. అదే సమయంలో బాటసారులు గుమిగూడారు. బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు సహాయం కోసం వేడుకుంటున్న దృశ్యం. ఇదే సమయంలో ప్రయాణికులు ఓపిక పట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కాపాడతామని పోలీసులు తెలిపారు. ప్రయాణికుల బస్సు బోల్తా పడకుండా క్రేన్ సాయం తీసుకుంటున్నారు.

Read Also:Talasani: అవసరమైతే వారికి నష్టపరిహారం ఇస్తాం