shocking incident from Bihar: కొన్ని సంఘటనలు చూస్తే మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందనే అనుమానం వస్తుంటుంది. కానీ కొందరు ఆ అనుమాలను వారి ప్రవర్తనతో నిజమని చెప్పకనే చెబుతున్నారు. అచ్చం అలాంటే ఘటనే బీహార్‌లో వెలుగుచూసింది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరు వ్యక్తులను స్తంభానికి కట్టేసి కొట్టి, ఆపై వారితో బలవంతంగా మూత్రం తాగించారు. ఈ దారుణమైన సంఘటన కతిహార్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
READ MORE: Vijayawada: వారి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. మ్యాన్‌హోల్‌లో పడి టీడీపీ నేత మృతి..!
కనికరం లేకుండా కొట్టి.. ఆపై
బీహార్‌లోని బరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని కతిహార్‌లో గ్రామస్థులు అదే గ్రామానికి చెందిన ఉమేష్ మండల్, మహ్మద్ ఇక్బాల్ అనే ఇద్దరు వ్యక్తులను మంత్రలు చేస్తున్నారనే అనుమానంతో స్తంభానికి కట్టేసి చితక్కోట్టారు. అనంతరం మానవత్వం అనేది మరచి వారితో బలవంతంగా మూత్రం తాగించారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బరారి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులిద్దరినీ గ్రామస్థుల చెర నుంచి రక్షించారు. అనంతరం బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. బాధితులిద్దరిని కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులిద్దరూ మంత్రాలు చేస్తున్నరనే గ్రామస్థుల వాదనపై కూడా విచారణ చేస్తామని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజలు తప్పు చేశారని పోలీసులు అన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతూ పోస్టులు పెడుతున్నారు.
READ MORE: Modi Trump meeting: సుంకాల సెగలో ప్రధాని మోడీ.. ట్రంప్‌ను కలుస్తారా?
