Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై ట్యాంకర్, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు చాలాసార్లు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రయాణికులు మరణించగా, 19 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
Redmi 13 5G Price: భారత్ మార్కెట్‌లోకి రెడ్‌మీ 13 5జీ.. ఫోన్‌తో పాటే ఛార్జర్!
అందిన సమాచారం ప్రకారం, డబుల్ డెక్కర్ బస్సు (UP95 T 4720) బీహార్ లోని మోతిహారి నుండి ఢిల్లీకి వస్తోంది. ఉన్నావ్ లోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధా గ్రామానికి ఉదయం 5.15 గంటలకు బస్సు చేరుకోగా, వేగంగా వచ్చిన పాలతో నిండిన ట్యాంకర్ దానిని వెనుక నుండి ఓవర్‌టేక్ చేసే సమయంలో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డబుల్ డెక్కర్ బస్సు ఒక్కసారిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతదేహాలు కుప్పలుగా పడ్డాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
TDP Worker Killed: అనంతపురంలో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేసి హత్య..
ఉన్నావ్ డీఎం గౌరంగ్ రాఠీ మాట్లాడుతూ.. “ఈ ప్రమాదం తెల్లవారుజామున 5.15 గంటలకు జరిగింది. బీహార్‌లోని మోతిహారి నుండి వస్తున్న ప్రైవేట్ బస్సు పాలు నింపిన ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించారు. మరో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారందరికీ చికిత్స అందిస్తున్నామని ” ఆయన అన్నారు.