NTV Telugu Site icon

Train Incident: లోకో పైలట్ చాకచక్యంతో తప్పిన భారీ రైలు ప్రమాదం

Train

Train

Train Incident: బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి, కతిహార్ నుండి జోగ్బానీకి వెళ్తున్న DMU రైలు చక్రానికి ఓ ఇనుప రాడ్‌ చిక్కుకోవడంతో ఘటన జరిగింది. అయితే, లోకో పైలట్ చాకచక్యంతో రైలు ఆగిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటన తర్వాత స్థానిక రాణిపాత్ర స్టేషన్ అడ్మినిస్ట్రేషన్, ఇతర రైల్వే అధికారులతో పాటు GRP ఫోర్స్ రావడంతో రాడ్ తొలగించబడింది. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో మరోసారి ఆందోళనలు.. అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్

కతిహార్‌ నుంచి జోగ్‌బానీకి వెళ్తున్న డీఎంయూ రైలు (07561) ఫ్లైవీల్‌కు రాడ్‌ చిక్కుకుందని, అయితే పైలట్‌ తెలివితేటల వల్ల రైలు నిలిచిపోయిందని రైల్వే శాఖ అధికారి తెలిపారు. ఈ ఘటనలో రైల్వే ట్రాక్‌పై రాడ్‌లు వేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై విచారణ జరుపుతున్నామని, నిందితులను గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనలో లోకో పైలట్ ఎటువంటి పొరపాటు చేయకుండా చాలా ప్రశాంతంగా రైలును ఆపాడని తెలిపారు. పైలట్ యొక్క ధైర్యసాహసాలు చెప్పుకోదగినవని, పైలట్ తెలివితేటలను కొనియాడారు రైల్వే అధికారులు.

Read Also: Bill Gates-Kamala Harris: కమలాహారిస్‌కు భారీ విరాళం అందించిన బిల్‌గేట్స్‌