NTV Telugu Site icon

Minister Ratnesh Sada: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మంత్రిని ఢీకొన్న ఆటో..

Ratnesh Sada

Ratnesh Sada

Minister Ratnesh Sada: బీహార్ రాష్ట్రం ప్రొహిబిషన్, ఎక్సైజ్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి రత్నేష్ సదా ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఆటో ఢీకొనడం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మహిషి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా బల్లియా సిమర్ అనే తన స్వగ్రామానికి చేరుకున్న మంత్రి రత్నేష్ సదా, ఉదయం వాకింగ్‌కు గార్డుతో కలిసి బయలుదేరారు. ఈ క్రమంలో వేగంగా వస్తున్న టెంపో అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి తల, కాలి వెనుక భాగంలో గాయాలయ్యాయి. అలాగే, ఆయన గార్డు కూడా గాయపడినట్లు సమాచారం.

Also Read: World Blitz Championship: చెస్‌ క్రీడా ప్రపంచంలో మరోసారి సత్తా చాటిన భారత్‌..

ప్రమాదం జరిగిన వెంటనే, మంత్రి, అతని గార్డును సదర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య బృందం వారు వెంటనే చికిత్స చేసారు. మంత్రికి తల, కాలు వెనుక భాగంలో గాయాలయ్యాయని.. గార్డుకు కూడా చేతి, కాలు వెనుక భాగంలో గాయాలు ఏర్పడ్డాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగుందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. రెండు మూడు గంటల చికిత్స చేసిన తర్వాత, మంత్రి సాధారణ స్థితికి చేరుకున్నారని, ఆ తర్వాత డిశ్చార్జి ఇచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా, మంత్రి ప్రత్యేక అభ్యర్థన మేరకు అతనిని ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించాలని వైద్యులు తెలిపారు. మంత్రికి గండం తప్పడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు.

Show comments