NTV Telugu Site icon

Train Incident: కదులుతున్న రైలుపై రాళ్లు రువ్విన వ్యక్తి.. దెబ్బకి ప్రయాణికుడి ముక్కు.?

Train Incident

Train Incident

Train Incident: కదులుతున్న రైలుపై యువకుడు రాళ్లు రువ్వి ప్రయాణికుడిని గాయపరిచిన బీహార్‌ కు చెందిన వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిందితుడు యువకుడు భాగల్పూర్ – జయనగర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ పై దర్భంగా – కంకర్‌ఘటి స్టేషన్స్ మధ్య రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారడంతో రాళ్లు రువ్విన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ఈ ఘటనపై స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Stock market: అల్లకల్లోలంగా దేశీయ స్టాక్ మార్కెట్.. తీవ్రంగా దెబ్బకొట్టిన అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు

రైలు నంబర్ 15553 భాగల్‌పూర్ – జయ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ పై సంఘ వ్యతిరేక వ్యక్తులు రాళ్లదాడి చేసిన విధంగా ఘటనపై రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ లో పేర్కొంది. ఇలాంటి సంఘ విద్రోహశక్తుల గురించి ప్రతి ఒక్కరూ వెంటనే రైల్వేశాఖకు తెలియజేయాలని కోరారు. అయితే ఈ ఘటనలో రాయి తగిలిన ప్రయాణికుడి ముక్కు నుండి రక్తం వచ్చినట్లు తెలిపి ఫోటోలను కూడా ఫోటోను రైల్వే శాఖ పోస్ట్ చేసింది. తదుపరి స్టేషన్‌ లో అతనికి ప్రథమ చికిత్స అందించారు.

Sheikh Hasina: ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఎక్కడికి వెళ్ళిపోయారు..?

Show comments