Bihar Elections 2025: ఇండియాలో మనోడి పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రాజకీయాలకు కార్పోరేట్ వాసనలు అద్దిన ఘనత నిజంగా ఆయన సొంతం. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తున్నారా.. ప్రశాంత్ కిషోర్. దేశంలో పలు ప్రధాన పార్టీలకు అధికారాన్ని దగ్గర చేసిన దిట్ట ఆయన. సరే అదంతా గతం.. ఇప్పుడు ఆయనే స్వయంగా పార్టీ పెట్టి తన సొంత రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అసలికే ఆయన ఆధునిక చాణక్యుడు.. ఈ ఆధునిక రాజకీయాల్లో ఎలా రాణించాలో, అధికారాన్ని ఏవిధంగా హస్తగతం చేసుకోవాలో ప్రధాన పార్టీల వారికే పాఠాలు నేర్పిన ఆయన.. తన పార్టీ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఆలోచించండి… ఇక్కడే ఆయన స్పిడ్ చూసి భయపడుతున్నారు. ఇంతకీ ఆయన సంధించే అస్త్రలు బిహార్ అధికార కూటమిని ఏవిధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, ఎన్డీఏ కూటమి విజయ అవకాశలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: US-India: భారత్‌కు షాక్ ఇచ్చిన అమెరికా.. ఇరాన్ ‘‘చాబహార్’’ పోర్టుపై కీలక నిర్ణయం..
సర్వేల్లో సంచలన విషయాలు..
బిహార్ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆయన ర్యాలీలకు పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో రాజకీయ క్షేత్రంలో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. అలాగే ఆయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ లభిస్తోంది. ఇప్పటికే ఆయనకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆయన ప్రధానంగా తన ప్రసంగాల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు సాధారణంగా లేవనెత్తే వలసలు, నిరుద్యోగం, అవినీతికి సంబంధించిన అంశాలను ఆయన లేవనెత్తుతున్నారు. ఇక్కడ విశేషం ఏమింటంటే.. రాజకీయాలను ప్రభావితం చేసే కులం కార్డు, సాంప్రదాయకంగా ఎన్డీఏ ప్రధాన ఓటర్లుగా పరిగణించబడుతున్న ఓటర్లను పీకే ఆకర్షిస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి.
బీజేపీ ఓటు బ్యాంకుకు పీకే దెబ్బ..
ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీస్తారని అనేక అభిప్రాయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. కొన్ని పోల్స్ ఆయన 8 నుంచి 10 శాతం ఓట్లను పొందవచ్చని అంచనా వేస్తున్నాయి. మరికొన్ని ఆయనను బిహార్ అసెంబ్లీలో కింగ్ మేకర్ అని కూడా పిలుస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ తన ప్రసంగాల్లో బీజేపీ నాయకులు, మంత్రులను లక్ష్యంగా చేసుకుంటూ సమస్యలను లేవనెత్తున్నారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగం, వలసలు, అవినీతి వంటి సమస్యలతో యువతను కలుపుకుంటు ముందుకు వెళ్తున్నారు. ఈ విషయాలు ఆయనకు సానుకూల పవనాలు వీచేలా చేస్తున్నాయి అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జనంలో పెరుగుతున్న స్పందన..
ప్రశాంత్ కిషోర్ విమర్శలపై స్థానిక బీజేపీ నాయకులు స్పందిస్తూ.. అవి వట్టి ఆరోపణలు అని ఖండిస్తున్నారు. ఆయన చేసే ఆరోపణల్లో వాస్తవాలు లేవని చెబుతున్నారు. బిహార్‌లోని అగ్రవర్ణ, యువ ఓటర్లు పీకేకి ఓటు వేయరని, అలాగే లాలూ-తేజస్వి తిరిగి రావాలని ప్రజలు ఎప్పటికీ కోరుకోరని బీజేపీ నాయకులు చెబుతున్నారు. పీకేను ఎదుర్కోవడానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ప్రచారానికి బీజేపీ నాయకులు కసరత్తులు ప్రారంభించారు. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మోదీ మిత్రల పేరుతో డిజిటల్ సైనికులను ఏర్పాటు చేసింది. వీరు ఎన్నికల ప్రచారానికి బాధ్యత తీసుకోనున్నారు. అలాగే ప్రభుత్వ పనిని సోషల్ మీడియా ద్వారా యువ ఓటర్లకు తెలియజేస్తున్నారు. తాజాగా మారుతున్న సమీకరణలతో బిహార్ ఎన్నికలు దేశం మొత్తానికి ఆసక్తిని రేపుతున్నాయి.
READ ALSO: Hyderabad Scam: రూ.600 కోట్ల స్కామ్.. గేటెడ్ కమ్యూనిటీనే టార్గెట్ చేసిన కిలాడీ లేడీ!
