Site icon NTV Telugu

Pawan Kalyan: బీహార్ ఎన్నికలపై డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో బీహార్ ఎన్నికల ఫలితాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. బీహార్‌లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించేందుకు దిశగా సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నాయకులు స్పందించారు. ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ విజయాన్ని అభినందిస్తూ.. బీహార్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద చూపుతున్న నమ్మకాన్ని మరోసారి రుజువుచేశారని అన్నారు. అభివృద్ధి, పారదర్శక పాలనకు ప్రజలు ఇచ్చిన అపూర్వ మద్దతే ఈ ఫలితాలకు కారణమని పేర్కొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరికీ అభినందనలు తెలుపుతూ.. ఈ తీర్పు దేశంలో ప్రజలు కోరుతున్న నాయకత్వం, పాలన విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

IND vs SA: 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. దక్షిణాఫ్రికా ఆలౌట్..!

అలాగే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా నెలకొంటున్న రాజకీయ ప్రవాహానికి అద్దం పట్టిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల పెరుగుతున్న ప్రజాదరణ ఈ ఫలితాల్లో స్పష్టంగా కనబడుతోందని వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలతో దేశాన్ని ముందుకు నడుపుతున్న మోదీకి బీహార్ ప్రజలు తమ మద్దతును బలంగా ప్రకటించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగానే డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి బీహార్ ప్రజలు కూడా మద్దతు ఇచ్చారని అన్నారు.

Card Cloning: కార్డ్ క్లోనింగ్ అంటే ఏంటీ.. అది ఎలా జరుగుతుందో తెలుసా…

Exit mobile version