Site icon NTV Telugu

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల ముందు జేడీయూలో కలకలం.. పార్టీ నుంచి 11 మంది సస్పెండ్

Nitish Kumar Jdu

Nitish Kumar Jdu

Bihar Elections 2025: బీహార్ ఎన్నికల ముందు జేడీయూలో కలకలం చెలరేగింది. రాష్ట్రంలో అధికార జనతాదళ్ యునైటెడ్ (JDU) సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి అనేక మంది ప్రముఖులను బహిష్కరించింది. పార్టీ సమాచారం ప్రకారం.. సస్పెండ్ అయిన వారిలో మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, MLC లు ఉన్నారు. వాస్తవానికి JDU తీసుకున్న ఈ సంచనల నిర్ణయంతో పార్టీలో కలకలం రేపింది. ఈ బహిష్కరణలకు సంబంధించిన అధికారిక ప్రకటన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందన్ కుమార్ సింగ్ జారీ చేశారు.

READ ALSO: Motorola Razr: డీల్ అంటే ఇది కదా.. మోటరోలా రేజర్ 60 ఫోల్డబుల్ ఫోన్ పై రూ. 10,000 తగ్గింపు..

పార్టీ కథనం ప్రకారం.. జేడీయూ నుంచి సస్పెండ్ అయిన వారిలో సీనియర్ నాయకులు మాజీ మంత్రి శైలేష్ కుమార్, మాజీ శాసన సభ్యురాలు సంజయ్ ప్రసాద్, బర్హరియా నుంచి మాజీ ఎమ్మెల్యే శ్యామ్ బహదూర్ సింగ్, బర్హరా భోజ్‌పూర్ నుంచి మాజీ శాసన సభ్యురాలు రణ్‌విజయ్ సింగ్, బార్బిఘా నుంచి మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ కుమార్ ఉన్నారు. వీరితో పాటు బెగుసరాయ్ నుంచి అమర్ కుమార్ సింగ్, వైశాలి నుంచి డాక్టర్ అస్మా పర్వీన్, ఔరంగాబాద్‌లోని నబీనగర్ నుంచి లవ్ కుమార్, కద్వా కతిహార్ నుంచి ఆశా సుమన్, మోతిహరి తూర్పు చంపారన్ నుంచి దివ్యాంశు భరద్వాజ్, జిరాదే సివాన్ నుంచి వివేక్ శుక్లా ఉన్నారు.

స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి ..
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ జేడీయూ అనేక మంది ప్రముఖ నాయకులను పార్టీ నుంచి బహిష్కరించింది. మొదటి దశ ఎన్నికలకు ముందు JDU తీసుకున్న ఈ సంచలన చర్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నాయకులలో కొందరికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్లు దక్కలేదు. తాజాగా చాలా మంది నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో JDU ను విడిచిపెట్టి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టమైన సంకేతాలను పార్టీ వర్గాల్లోకి పంపించారు. ఎన్నికలకు ముందు క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం పార్టీ వర్గాలకు సంకేతంలా పని చేసిందని రాజకీయ వర్గాలు పేర్కొ్న్నాయి. పార్టీలో ఇప్పుడు జేడీయూ భావజాలం, నాయకత్వం, విధానాలకు విధేయులైన వారితో మాత్రమే పని చేస్తుందని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. రాబోయే ఎన్నికలలో ఐక్యత సందేశాన్ని అందించడానికి JDU “నష్ట నియంత్రణ” వ్యూహంలో భాగంగా ఈ చర్యను తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

READ ALSO: Indian Navigation App: ఇకపై గూగుల్ మ్యాప్స్ కాదు.. “నావిక్”

Exit mobile version