Site icon NTV Telugu

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌తో తేజస్వీ యాదవ్‌కు సంబంధం ఉంది..

Bihar

Bihar

NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. పాట్నాలో నీట్ పేపర్ లీక్‌తో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వీ యాదవ్ సన్నిహితుడికి దగ్గరి సంబంధం ఉందని పేర్కొన్నారు. ఇవాళ (గురువారం) విజయ్ మీడియాతో మాట్లాడారు.. నీట్ ప్రశ్న పత్రం లీక్ కేసులో అరెస్టైన సికిందర్ యాద్వెందు తేజస్వీ పీఏ ప్రీతమ్ కుమార్ సమీప బంధువు అని చెప్పుకొచ్చారు.

Read Also: Airtel New Plan 2024: ఎయిర్‌టెల్‌లో కొత్త ప్లాన్‌.. తక్కువ ధరతో ఎక్కువ వ్యాలిడిటీ!

ఇక, యాదవెందు తన మేనల్లుడైన నీట్ విద్యార్థి అనురాగ్ యాదవ్, ఇతర సహచరులను పాట్నాలోని ప్రభుత్వ బంగ్లాలో ఉంచడానికి సిఫారసు చేసినట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పేర్కొన్నారు. అభ్యర్థి బస చేసిన గెస్ట్ హౌస్‌లో ప్రీతమ్ గదిని కూడా బుక్ చేశారని అతుడు ఆరోపణలు గుప్పించారు. ‘తేజస్వి ఆదేశాల మేరకు ఏయే అధికారులు పని చేస్తున్నారో తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు. ఆర్జేడీ చరిత్ర మొత్తం నేరాలు, అవినీతిపై ఆధారపడి ఉందని మండిపడ్డారు. కాగా, నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నుంచి వివరణ కోరారు.

Exit mobile version