Bihar: బలపరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీలో (Bihar Assembly) జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ (Nitish Kumar) సర్కార్ విజయం సాధించింది. అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో సీఎం నితీశ్ కుమార్‌కు 129 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన బలపరీక్షలో సునాయసంగా గట్టెక్కేశారు. మరోవైపు అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.
అంతకముందు ఆర్జేడీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌లో ఉంచారు. జేడీయూకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు నితీష్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారేమోనని ప్రచారం జరిగింది. కానీ మొత్తానికి నితీష్ కుమార్ ఫ్లోర్ టెస్ట్‌లో నెగ్గారు. ఇటీవలే ఆయన ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా నితీష్‌కు మద్దతుగా నిలవడంతో బలపరీక్షలో విక్టరీ సాధించారు.
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కి 122 సీట్లు ఉండాలి. నితీష్ వర్గం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సభలో ఉన్న 129 మంది ఎమ్మెల్యేలంతా నితీష్‌కు మద్దతుగా ఓటు వేశారు. దీంతో అవిశ్వాస తీర్మానంలో నితీష్ సర్కార్ సునాయసంగా గట్టెక్కేసింది.
ఇటీవలే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చి ఎన్డీఏతో జతకట్టింది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేసిన రోజే.. కొన్ని గంటల్లో బీజేపీ మద్దతుతో నితీష్‌కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి హిస్టరీ సాధించారు. సోమవారం జరిగిన బలపరీక్షలో కూడా ఆయన విజయం సాధించారు.
#WATCH | Bihar CM Nitish Kumar's government wins Floor test after 129 MLAs support the resolution.
The opposition walked out from the State Assembly. pic.twitter.com/Xr84vYKsbz
— ANI (@ANI) February 12, 2024
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!