NTV Telugu Site icon

BiggBoss OTT 3 Winner: బిగ్ బాస్ విజేతగా హీరోయిన్.. ఏకంగా అన్ని లక్షల ప్రైజ్ మని..

Biggboss Ott 3 Winner

Biggboss Ott 3 Winner

BiggBoss OTT 3 Winner Sana Makbul : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బిగ్ బాస్ OTT సీజన్ 3 విజేతగా సనా మక్బుల్ ట్రోఫీని గెలుచుకుంది. సనా.. రాపర్ నేజీ రన్నరప్‌ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ఇకపోతే ట్రోఫీ సమయంలో సనా మక్బూల్ చాలా ఎమోషనల్‌గా కనిపించింది. బిగ్ బాస్ OTT 3 టైటిల్ గెలుచుకున్న తర్వాత, సనా మక్బూల్‌పై డబ్బు వర్షం కురిపించింది. సనాకు మెరిసిపోయే ట్రోఫీతోపాటు రూ.25 లక్షల ప్రైజ్ మనీ లభించింది.

BC-OBC Reservations: ఈ నెల 7, 8 తేదీల్లో ఢిల్లీలో బీసీ, ఓబీసీ విద్యార్థి నేతల నిరసన దీక్ష..

బిగ్ బాస్ OTT సీజన్ 3లో జూన్ 21న 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌ లోకి ప్రవేశించారు. బిగ్ బాస్ OTT 3 హౌస్ నేజీ, సనా మక్బూల్, రణ్‌వీర్ షోరే, కృతికా మాలిక్, సాయి కేతన్ రావ్, సనా సుల్తాన్, శివాని కుమారి, అర్మాన్ మాలిక్, దీపక్ చౌరాసియా, విశాల్ పాండే, పాయల్ మాలిక్, లవకేష్ కటారియా, చంద్రికా ఖారాజ్ గోయత్, మునీషా ఖారాజ్ గోయత్. మరియు పౌలోమి దాస్ హౌస్‌ లోకి ప్రవేశించారు. వీరిలో సనా కాకుండా, బిగ్ బాస్ OTT 3 గ్రాండ్ ఫినాలే టాప్-5 కంటెస్టెంట్స్‌ లో నేజీ, సాయి కేతన్ రావ్, కృతిక మాలిక్, రణవీర్ షోరే ఉన్నారు. ఇక చివరకు అయితే ఛాంపియన్ గా సనా మక్బూల్‌ నిలిచింది.

Alien Temple: ఇదేందయ్యా ఇది.. గ్రహాంతరవాసికి గుడి కట్టేస్తున్న వ్యక్తి..

బిగ్ బాస్ OTT 3 విజేత సనా మక్బూల్ మోడల్‌ తో పాటు నటి కూడా. ఆమె తమిళం, తెలుగు చిత్రాలలో పనిచేసింది. సనా 2014లో దిక్కులు చూడకు రామయ్య అనే తెలుగు సినిమాతో తన సినీ కెరీర్‌ ని ప్రారంభించింది. అంతేకాకుండా సనా హిందీ టెలివిజన్‌లో కూడా కనిపించింది. ఇంకా కలర్స్ టీవీ షో సూపర్ నేచురల్ డ్రామా విష్‌ లో డాక్టర్ అలియా కొఠారి పాత్రను సనా మక్బూల్ పోషించింది.

Show comments