బిగ్ బాస్ లో ఈ వారం కొత్త టాస్క్ లతో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.. ఈరోజు కూడా కొత్త టాస్క్ లతో జనాలను ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. నిన్న బాల్ గేమ్ అవ్వగానే ఈరోజు బలానికి పరీక్ష పెట్టాడు బిగ్ బాస్.. ఇవ్వాళ్టి ఎపిసోడ్ బిగినింగ్లోనే దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు. బ్లాక్ బాల్ దక్కించుకున్న వీర సింహాలకు ఓ అడ్వాంటేజ్ ఉంటుందంటూ చెబుతాడు.. ఇక అదేంటో తెలుసుకోవాలనే కోరికతో జనాలు రెచ్చిపోతారు.. అందులో అమర్ కాస్త ఓవర్ అయ్యాడు..
‘హాల్ ఆఫ్ బాల్’ గేమ్ గెలవడంతో… కెప్టెన్సీ కంటెడర్స్ గా ఎన్నికైన వీర సింహాలు.. ఓటింగ్ ద్వారానే తమలో ఒకరిని కెప్టెన్ చేస్తాడంటూ… అవతలి టీంలో ఉన్న సభ్యులను మచ్చిక చేసుకుంటూ ఉండగా… ఉన్నట్టుండి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్… మరో దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తాడు. కెప్టెన్ ఎవరనేది ఫిజికల్ టాస్క్‌తో తేలుస్తామని చెబుతాడు.. ఈ టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో కెప్టెన్ కంటెండర్స్ ఫోటోలతో బీన్ బ్యాగ్స్ ఉంటాయని.. కెప్టెన్ కంటెండర్స్‌ను సపోర్ట్ చేసిన వాళ్లు… వారి వారి సపోర్ట్ చేస్తున్న కంటెండర్స్ బ్యాగ్‌ను భుజానికి వేసుకొని.. యెల్లో సర్కిల్లో తిరుగుతూ…. అవతలి బ్యాగ్‌లో ఉన్న బీన్స్ కింద పడిపోయేలా చేయాలని చెబుతాడు. అలా బజర్ మోగే టైంకు.. ఎవరి బ్యాగ్‌లో తక్కువగా బీన్స్ ఉంటాయో.. వాళ్లు గేమ్ నుంచి బయటికి వెళతారని బిగ్ బాస్ చెబుతాడు..
ఈ ఆటలో భోలే పని అయిపొయింది.. రతిక కోసం గేమ్ ఆడేందుకు ముందుకు వస్తాడు. అశ్విని చాలా డిస్కషన్స్ తర్వాత గౌతమ్ కోసం గేమ్ ఆడుతానంటూ ముందుకు వస్తుంది. శివాజీ అర్జున్ కోసం బరిలో దిగుతాడు.. కాసేపటికే శివాజీకి నొప్పి అవ్వడం తో బయటకు వచ్చేస్తాడు.. ఇక అమర్ మాత్రం కొద్ది సేపటి తర్వాత రెచ్చిపోయాడు..భోలే షావలి కూడా అమర్ ను కాలర్ పట్టుకుని కొట్టినంత పని చేస్తాడు. ఒకరినొకరు డొక్కలో గుద్దుకుంటూ.. చూస్తున్న ఆడియెన్స్‌ను షాక్ అయ్యేలా చేస్తుంటారు. ఇక మరో పక్క సంచాలక్ పల్లవి ప్రశాంత్ వీరిని కంట్రోల్ చేసేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తుంటాడు..అమర్ ఈ సారి.. మరింత అగ్రెసివ్‌గా అటాక్ చేస్తాడు. రెచ్చి పోయి మరీ పిచ్చి పిచ్చిగా భోలే బీన్ బ్యాగ్ మీద పతడాతు. కుర్రాడి ధాటికి పాపం భోలే బిత్తర పోయి.. ఏం చేయలో పాలుపోని స్థితికి వెళిపోతాడు… ఇక టాస్క్ పూర్తి అవ్వగానే శోభా కెప్టెన్ అవుతుంది.. బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ లేడీ కెప్టెన్‌గా.. గౌతమ్ నుంచి బ్యాడ్జ్ అందుకుంటుంది.. ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..