NTV Telugu Site icon

Bigg Boss7 Telugu : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

11 Week Elimination

11 Week Elimination

తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. ప్రస్తుతం ఏడో సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ వారం 11 వ వారం ముగింపుకు చేరుకుంది.. ఇప్పుడు హౌస్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. అయితే ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోతారో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు.. యావర్ అత్యధిక ఓట్లతో నెంబర్ వన్ ర్యాకింగ్ లో ఉండగా, చివరి స్థానంలో శోభా ఉంది..

ఈ వారం బిగ్ బాస్ ట్విస్ట్ లు ఏం చేయకుండా శోభాశెట్టిని ఎలిమినేషన్ చేస్తారా లేక ఉల్టా పల్టా అంటూ ఆ తర్వాత స్థానంలో ఉన్న గౌతమ్ కృష్ణని ఎలిమినేషన్ చేస్తారా అనే సస్పెన్స్ అందరిలో ఉంది. అసలు నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందిలో యావర్ ఈ వారం ‘ ది బెస్ట్ ప్లేయర్’ అనిపించుకుంటున్నాడు.. ఇక గౌతమ్ అర్జున్ ను, శివాజీని టార్గెట్ చేస్తూ నెగిటివిటిని సంపాదించుకున్నాడు.. అంబటి అర్జున్ కన్నింగ్ గేమ్ ఇప్పటికే అందరికి ప్రేక్షకులకు అర్థం అయింది. దీంతో హౌస్ లో ఎలిమినేషన్ లో శోభాశెట్టి, గౌతమ్, అంబటి అర్జున్ డేంజర్ జోన్ లో ఉన్నారు.

ప్రియాంక హౌస్ లో పెద్దగా రాణించలేకున్నా కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి.. ఇక ఈ వారం హౌస్ లో తక్కువ ఓట్లతో అశ్విని, శోభా లిస్టులో ఉన్నారు.. రతిక గేమ్ ఆడకపోయిన కంటెంట్ క్రియేట్ చేయడం కోసం గట్టిగానే మాట్లాడుతుంది. ఇటు అశ్వినిశ్రీతో గుసగుసలు, అటు అంబటి అర్జున్ తో చెప్పుడు మాటలు చెప్తూ రతిక ఎంతో కొంత కంటెంట్ కోసం కష్టపడుతుంది.. శోభా టాస్కులు ఇచ్చిన ప్రతిసారి ఏదొక రచ్చ చేసి జనాలకు విసుగు తెప్పించింది.. సో ఈ వారం శోభాను ఆడియన్స్ ఖచ్చితంగా బయటకు పంపిస్తారని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతుంది.. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి..