Site icon NTV Telugu

Bigg Boss 9 Winner: బిగ్‌బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్! హిస్టరీ క్రియేట్ చేసిన విన్నర్..

Kalyan Padala

Kalyan Padala

Bigg Boss 9 Winner: బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే ఆదివారం ముగిసింది. తెలుగు బిస్ బాస్ చరిత్రలో ఏ సీజన్‌లో లేని విధంగా ఈ సీజన్‌లో కామనర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో పరీక్షలకు తట్టుకొని చివరి వరకు నిలిచిన టాప్ 5 ఆటగాళ్లుగా తనూజ, కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ ఉన్నారు. అయితే మొదటి నుంచి ఊహించినట్లుగానే బిగ్‌బాస్ టైటిల్ రేసులో ఇద్దరి మధ్యనే టైటిల్ ఫైట్ నెలకొంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు, ఈ సీజన్ బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: CMR Shopping Mall: సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో ‘కాస్మోటిక్స్‌, ఫుట్‌వేర్‌, హోం నీడ్స్‌.!

బిగ్‌బాస్ టాప్ 5లో నుంచి ఫస్ట్ సంజన గల్రానీ ఎలిమినేట్ అయ్యారు. ఆమె తర్వాత ఇమ్మాన్యుయేల్‌ హౌజ్ నుంచి బయటికి వచ్చాడు. ఇమ్మాన్యుయేల్‌ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి డిమాన్ పవన్ ఎలిమినేట్ బయటికి వచ్చాడు. ముందు నుంచి అనుకున్నట్లుగానే టైటిల్ కోసం తనూజ – కళ్యాణ్ పడాల మధ్య భీభత్సమైన వార్ జరిగింది. నిజానికి బిగ్ బాస్ హౌస్‌లోకి ఒక కామనర్‌గా కళ్యాణ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే బిగ్ బాస్ హౌస్‌లో వన్ ఆఫ్ ది టఫ్ ఫైటర్స్‌లో ఒకరిగా తనూజ ఉంది. వీళ్లిద్దరి మధ్య టైటిల్ కోసం జరిగిన సమరం వేరే లెవల్. చివరికి బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ ఫర్ ది ఫస్ట్ టైం, ఒక కామనర్ విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. నిజానికి బిగ్ బాస్ సీజన్ ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకున్నా, హౌజ్‌లోకి కామనర్స్‌ ఫస్ట్ టైం సీజన్ 9 లోనే ఎంట్రీ ఇచ్చారు. అయితే కామనర్స్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ వారిలో అందరూ ఎలిమినేట్ కాగా టాప్ 5 వరకు కేవలం కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్‌లు మాత్రమే చేరుకోగలిగారు. వారిలో కూడా ఒక కామనర్‌గా కళ్యాణ్ పడాల బిగ్ బాస్ టైటిల్‌ను గెలుచుకొని బిగ్ బాస్‌ హిస్టరీలో నయా చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ సీజన్ రన్నరప్‌గా హౌస్‌లో వన్ ఆఫ్ ది టఫ్ ఫైటర్స్‌లో ఒకరిగా ఉన్న తనూజ నిలిచింది.

READ ALSO: Dimon Pawan: బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే.. పవన్ ఆనందానికి అవధుల్లేవు..

Exit mobile version