Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం రెండో వారం కొనసాగుతోంది. మొదటి వారంలో ఇంటి నుండి బేబక్క ఎలిమినేట్ అయింది. ఇక మంగళవారం నాడు నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా జరిగింది. ఇకపోతే రెండవ వారంలో కంటెస్టెంట్స్ వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకొనే స్థాయికి వెళ్ళింది. లవ్ ట్రాక్ లో ఉన్నారనుకున్న సోనియా విష్ణుప్రియల మధ్య కాస్త బెరిసినట్లుగా కనబడుతోంది. మొన్నటివరకు లవ్ ట్రాక్ లో పడుతున్నట్లు కనిపించిన నిఖిల్ సోనీయాల మధ్య కూడా ద్వేషం మొదలైంది. బుధవారం నాడు బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కు సంబంధించిన టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో కాస్త గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. యాష్మీ, నైనిక టీం సభ్యులు మాత్రమే ఈ టాస్క్ లో గెలవగా.. మిగతావారు ఓడిపోయారు. ఓడిపోయిన వారికి ఫుడ్ అందకపోవడంతో సీత కన్నీరు పెట్టుకుంది.
Swiggy Boy Delivery Ganja: గంజాయి డోర్ డెలివరీ.. స్విగ్గీ డెలివరీ బాయ్ అరెస్ట్..
ఇకపోతే ఫుడ్ టాస్క్ లో ఓడిపోయిన నిఖిల్, మణికంఠలు బిగ్ బాస్ పంపిన కూరగాయలను ఉడికించుకొని తింటూ గడిపేస్తున్నారు. అయితే తనకి బాగా నీరసంగా ఉందంటే.. ఎవరైనా తనకి ఫల్పి ఆరెంజ్ ముఖాన కొట్టండి అని మణికంఠ అడగగా.. పక్కనే ఉన్న నిఖిల్ వెంటనే రక్తం తాగుతున్నావు కదరా ఇంకేం కావాలి నీకు అంటూ కాస్త ఘాటుగా స్పందించాడు. ఇక మరోవైపు హాట్ టాపిక్ గా మారిన సోనియా.. అభయ్ తో కొన్ని సీక్రెట్ విషయాలను మాట్లాడడం జరిగింది. ఇదిలా ఉండే రెండోవారం నామినేషన్ లో భాగంగా సోనియా ఇచ్చిన షాక్ నుండి నిఖిల్ కోలేక కూర్చుని బాధపడుతున్నాడు. ఆ సమయంలో మిగిలిన వద్దకు వెళ్లిన నైనిక నువ్వు ఒక ఎమోషనల్ ఫూల్ అంటే మాట్లాడింది.
Dhanush: ధనుష్ పై నిషేధం ఎత్తివేత..
నిఖిల్ ను చూస్తూనే కోపం వస్తోంది అంటూ సోనియా అభయ్ తో మాట్లాడింది. దానికి సమాధానంగా నువ్వు అతనిని పదేపదే లూజర్ అంటున్నావ్.. అంట కదా.. అందుకు అతడు ఫీల్ అవుతున్నాడు. ఇలా తిడుతుంటే ఇంకెలా మాట్లాడుతాడు అంటూ తెలిపాడు. దానికి అంత మాట్లాడటం అవసరం లేదు.. మామూలుగా అయినా మాట్లాడొచ్చు కదా అంటూనే.. అలాగే బిగ్ బాస్ హౌస్ నాశనం అవ్వాలంటే విష్ణు ప్రియ లాంటివాళ్ళు ఉంటే చాలు అన్నట్లుగా సోనియా మాట్లాడింది. హౌస్ లో రెచ్చగొట్టేది ఆవిడే అని సోనియా అంది. చూడాలి మరి ఏ మాటలు ఎంతవరకు దారితీస్తాయో.