Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!

Bigg Boss 10

Bigg Boss 10

Bigg Boss 10: ఇప్పటికే తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్, ఇప్పుడు పదవ సీజన్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది. గత సీజన్లో కళ్యాణ్ పడాల అనే కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచాడు. ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ అంటూ ప్రారంభించిన షో ద్వారా కొంతమంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. అలా హౌస్ లోకి వచ్చిన కళ్యాణ్ పడాల విన్నర్గా నిలిచి కప్ గెలుచుకున్నాడు.

ఇక బిగ్ బాస్ పదవ సీజన్ కి కూడా ఇదేవిధంగా ‘అగ్నిపరీక్ష’ పేరుతో మరో షో నిర్వహించేందుకు జియో హాట్ స్టార్, స్టార్ మా సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు, బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించిన సెట్ వర్క్ ప్రారంభమైంది. బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.

బిగ్ బాస్ థర్డ్ సీజన్ నుంచి ఇప్పటివరకు విజయవంతంగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున, ఈ సీజన్ కి కూడా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. గత సీజన్లతో పోలిస్తే మరింత భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇక సెట్ వర్క్ ఈరోజు ప్రారంభమవగా, వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. దీనికి సమాంతరంగా, ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ ద్వారా కొంతమంది కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారు.