Bigg Boss 8 Telugu Naga Manikanta Eliminated: రియాలిటీ షో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో అనూహ్య సంఘటనలు, ఆశ్చర్యకరమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మునుపటి సీజన్‌ల మాదిరిగా కాకుండా.. ఈ సీజన్‌లో డబుల్ ఎలిమినేషన్‌లు, వైల్డ్‌కార్డ్‌ల ద్వారా 8 మంది పోటీదారులు హౌస్‌కి రావడం, మిడ్‌వీక్ ఎలిమినేషన్‌లు ఇంకా సెల్ఫ్ ఎలిమినేషన్ లు ఉన్నాయి. ఎక్సైటింగ్ బిగ్ బాస్ షో నుండి ఏడో వారంలో నాగమణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, నాగమణికంఠ ఎంత పారితోషికం అందుకున్నడన్న విషయానికి వస్తే..
Read Also: Delhi Police: ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు.. టెలిగ్రామ్ ఛానెల్‌కు పోలీసుల లేఖ
బిగ్ బాస్ సీజన్ 8 లో 7వ వారంలో గౌతమ్, పృథ్వీ, నిఖిల్, యష్మీ, తేజ, మణికంఠ, నబీల్, హరితేజ, ప్రేరణలు నామినేషన్ లో ఉన్నారు. ఈ సీజన్‌లో తొలిసారిగా 9 మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉండగా, ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఎవరికి తక్కువ ఓటు వేస్తారో వారికే వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు. ఓటు విషయానికొస్తే, అది పృథ్వీ ఇంకా గౌతమ్ ఎలిమినేట్ అవుతారు. ఒకానొక సమయంలో పృథ్వీ ఎలిమినేట్ అవుతాడనే ప్రచారం కూడా జరిగింది. కానీ… ఎవరూ ఊహించని విధంగా నాగమణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. ఈ నిర్ణయం బిగ్ బాస్ ది కాదు. ఇది బిగ్ బాస్ అభిమానులకు కూడా ఊహించని షాక్. బీబీ అభిమానులు మణికంఠ కు మద్దతుగా నిలిచారు. ఈ ఏడు వారాల్లో మణికంఠను ఇంటికి పంపేందుకు ఆరుసార్లు నామినేట్ అయ్యాడు. అయితే, మణికంఠను మెచ్చిన ప్రేక్షకులు.. నామినేషన్లు వేసిన ప్రతిసారీ ఓ వైపు ఓట్లు వేశారు.
Read Also: Donald Trump: మెక్‌డొనాల్డ్స్‌లో చెఫ్‌గా మారిన డొనాల్డ్ ట్రంప్(వీడియో)
బిగ్ బాస్ సీజన్ రీ లాంచ్ వరకు స్ట్రాంగ్ గా ఉన్న మణికంఠ మణికంఠ తాను ఆ తర్వాత అతను ఇంటికి వెళ్లిపోతానని పట్టుబట్టారు. మణికంఠ తన సొంత నిర్ణయంతో ఆటను వదిలేసి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన మణికంఠ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చినప్పుడు తాను ఎవ్వరికీ తెలియదనీ, ఆడియెన్స్ సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వల్లనే తాను బయటకు వెళ్తునని తెలిపారు. తనకు సపోర్టుగా నిలిచిన ఆడియెన్స్‌కు ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోయాడు. మణికంఠ 7 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఎంత సంపాదించాడన్న విషయం ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. మణికంఠ బిగ్ బాస్ లోకి రావడానికి వారానికి రూ.1.20 లక్షలు పారితోషకం అందజేసినట్టు సమాచారం. ఈ లెక్కన చూస్తే.. 7 వారాలకు గానూ.. దాదాపు రూ. 8 లక్షలకి పైగానే తీసుకున్నట్లు సమాచారం.