NTV Telugu Site icon

BiggBoss Telugu 8 : హిస్టరీలో ఫస్ట్ టైం.. దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్

Biggboss8

Biggboss8

BiggBoss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 టోటల్ ఫ్లాప్ అవుతుందని ఇటీవ‌ల టీఆర్‌పీ రేటింగ్స్‌ని బట్టి చూస్తే అర్థమవుతోంది. కొత్త కంటెస్టెంట్స్‌ని తీసుకొచ్చి, కొంతమంది పాత కంటెస్టెంట్స్‌ని పరిచయం చేసినప్పటికీ, ప్రేక్షకులను మెప్పించడంలో మేకర్స్ విఫలం అవుతున్నారని జనాలు భావిస్తున్నారు. భారీ వ్యయంతో భారీ స్థాయిలో ఎపిసోడ్‌లు నడుపుతున్నప్పటికీ బిగ్‌బాస్‌ని చూసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రేటింగ్స్ పెరగడం లేదు. సీజన్ 6లాగే ఇది కూడా ఓవరాల్ ఫ్లాప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం, హౌస్‌లో 8 మంది పాత కంటెస్టెంట్లు ఉన్నారు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా వచ్చిన మరో 8 మంది ఉన్నారు. వారి ఎంట్రీలకు సంబంధించిన సన్నివేశాలను రీలోడ్ పేరుతో ఆరో రోజు ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించారు. ఆ ఎపిసోడ్ రన్ టైమ్ అక్షరాలా మూడున్నర గంటలు. ఆ ఎపిసోడ్ కు కూడా పెద్దగా రేటింగ్స్ పెద్దగా రాలేదు. హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఆరు కంటే తక్కువ రేటింగ్ వచ్చింది. శనివారం నాటి వీకెండ్ షో రేటింగ్స్ ఐదు కంటే తక్కువకు పడిపోయాయి. మిగిలిన రోజుల్లో రేటింగ్స్ 3.5 నుంచి 4కి పడిపోయాయి. మరి దసరా స్పెషల్ ఎపిసోడ్ రేటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Read Also:IND vs NZ: టీమిండియాకు శుభవార్త.. నేడు బ్యాటింగ్‌కు పంత్!

మాములు సమయాల్లోనే ఈ టీఆర్పీ రేటింగ్స్ ఇలా పడిపోవడం చూస్తుంటే ప్రేక్షకుల్లో దీనిపై పూర్తిగా ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ రియాల్టీ షో 21కి పైగా టీఆర్‌పీ రేటింగ్స్‌ను రాబట్టిన సందర్భాలు ఉన్నాయి.. ఆ స్థాయి నుంచి 3.5 రేటింగ్స్‌కి పడిపోవడం చాలా ఆశ్చర్యకర విషయం. బిగ్‌బాస్ తెలుగు షో చరిత్రలో ఇంత తక్కువ రేటింగ్స్ ఎప్పుడూ ఉండకపోవచ్చు. సరైన కంటెస్టెంట్స్ లేకపోవడం, పాత గేమ్‌లు, క్రియేటివిటీ లేకుండా పాత టాస్క్‌లు ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తున్నాయి. నాయని పావని, మణికంఠ, గౌతమ్ కృష్ణ, పృథ్వీ వంటి క్యారెక్టర్ల కారణంగా ఈ సీజన్‌ని ఎవరూ చూడాలని అనుకోవడం లేదని తెలుస్తోంది.

Read Also:Banjara Hills: పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు.. అదుపులో 100 మంది యువకులు, 42 మంది మహిళలు..

గౌతమ్ కృష్ణ లాజిక్ లేకుండా కోపంలో అరుస్తాడు. ఒక్కసారి కారణం లేకుండా మైక్ విసిరాడు. ఇటీవల జరిగిన టాస్క్ లోనూ ఇంటి నుంచి వెళ్లిపోతానని అరుస్తూ పిచ్చివాడిలా ప్రవర్తించాడు. అవినాష్, రోహిణి బాగా ఆడుతున్నారు. కొన్ని కారణాల వల్ల హరితేజ ప్రేక్షకులు కోరుకున్న వినోదాన్ని అందించలేకపోతోంది. గంగవ్వ ఈ షోకి సరిపోదని, ఎందుకు తీసుకొచ్చారో వాళ్లకే తెలియాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. విష్ణుప్రియ కూడా నిరాశపరుస్తోంది. మణికంఠ మొదట్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినా.. ఈ మధ్య కాలంలో అవినాష్ టీమ్ ట్రాప్ లో పడకుండా జాగ్రత్తపడ్డాడు. కోవర్టుగా మారడానికి ఒప్పుకోనని చెప్పి తన తెలివితేటలను ప్రదర్శించాడు. అయితే ఓవరాల్ గా ఈ సీజన్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అందుకే రెస్పాన్స్ చాలా పేలవంగా ఉంది.

Show comments